Govindaraja Swamy
-
తిరుపతిలో లావణ్య ఫోటో ఫ్రేమ్స్ షాపులో భారీగా మంటలు..!
-
ప్రమాదాన్ని ముందే పసిగట్టిన గజరాజు.. గోవిందరాజు స్వామి ఆలయంలో ఏం జరిగింది?
సాక్షి, తిరుపతి: గోవిందరాజు స్వామి ఆలయ ఆవరణలో అపశ్రుతి చోటు చేసుకుంది. సాయంత్రం కురిసిన గాలి వానకు ఆలయ ధ్వజస్తంభం వద్ద ఉన్న పురాతన రావి చెట్టు కూలిపోయింది. ఈ ఘటనలో ఒక భక్తుడు మృతి చెందగా, ముగ్గురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు కడపకు చెందిన డాక్టర్ గుర్రప్పగా పోలీసులు గుర్తించారు. టీటీడీ ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది. వందల ఏళ్ల నాటి రావి చెట్టుగా స్థానికులు చెబుతున్నారు. స్వామివారి ఉత్సవాలకు సిద్ధం చేసిన గజరాజు అప్రమత్తతతో పెను ప్రమాదమే తప్పింది. చెట్టు కూలిపోవడానికి ముందుగానే పసిగట్టిన గజరాజు ఘీంకరించడంతో అప్రమత్తమై పరుగులు తీశామని భక్తులు అంటున్నారు. మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా సంఘటన ప్రాంతాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. మృతుడు గుర్రప్ప కుటుంబానికి ఐదు లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి టీటీడీ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గోవిందరాజస్వామి ఆలయం మహా సంప్రోక్షణ ఆపండి
సాక్షి, అమరావతి : తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి దేవస్థానం గర్భగుడి విమాన గోపురంపై బంగారు పూతతో కూడిన రాగి రేకులను ఏర్పాటు చేసే విషయంలో అక్రమాలు జరిగాయని, వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు అడ్వొకేట్ కమిషన్‌ను నియమించాలని కోరుతూ హైకోర్టులో గురువారం లంచ్‌మోషన్ రూపంలో అత్యవసర పిటిషన్ దాఖలైంది. గోవిందరాజ స్వామి దేవస్థానంలో ఈ నెల 21న తలపెట్టిన మహా సంప్రోక్షణ వాయిదా వేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తిరుపతికి చెందిన తుమ్మా ఓంకార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి విచారణ జరిపారు. ఇదే వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయని, వాటిపై కోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని టీటీడీ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.సత్యనారాయణ ప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యాజ్యాల్లో కౌంటర్లు కూడా దాఖలు చేశామన్నారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. టీటీడీ కౌంటర్‌తో పాటు ఇతర అంశాలనూ పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు. అంతకు ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది జేవీ ఫణిదత్ వాదనలు వినిపిస్తూ.. ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా విమాన గోపురానికి బంగారుపూత పూసిన రాగి రేకులు అమర్చడం వల్ల గోపురం దెబ్బతింటుందని చెప్పారు. ఇందులో అక్రమాలు జరిగాయని, రాగి రేకులకు బంగారు పూతకు బదులు బంగారు రంగు వేస్తున్నారని, వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు అడ్వొకేట్ కమిషన్‌ను నియమించాలని కోరారు. మహా సంప్రోక్షణ పూర్తయితే గర్భగుడిని ఎక్కి విమాన గోపురాన్ని పరిశీలించే అవకాశం ఉండదన్నారు. అందువల్ల మహా సంప్రోక్షణను నిలిపివేయాలని కోరారు. -
గోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి యత్నం
-
గోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి యత్నం
సాక్షి, తిరుపతి: శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి విఫలయత్నం జరిగింది. ఆలయంలోని హుండీలు ఎత్తుకెళ్లేందుకు దొంగ యత్నించాడు. హుండీ తాళానికి వేసిన లక్క, క్లాత్‌ని మాత్రమే తొలగించిన ఆ దొంగ ప్రయత్నాలు ఫలించలేదు. సీసీ కెమెరాల్లో ఆ దుండగుడు దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులు, టీటీడీ విజిలైన్స్ అధికారులు సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. రాత్రి తొమ్మిది గంటలకు ఆలయాన్ని మూసివేసిన తర్వాత దొంగతనానికి ప్రయత్నించినట్టు అధికారులు భావిస్తున్నారు. -
‘బాబు పాలనలో భగవంతుని పట్ల తీరని అపచారం’
-
‘బాబు పాలనలో భగవంతుని పట్ల తీరని అపచారం’
తిరుపతి: టీటీడీ దేవస్థానంలో నగలు మాయమవుతున్నాయని అనేక ఫిర్యాదులు వచ్చినా ఏపీ సర్కారు విచారణ జరిపించకపోవడంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని గోవిందరాజు స్వామి ఆలయంలో ఉత్సవమూర్తులకు అలంకరించే మూడు బంగారు కిరీటాలు మాయం కావడం సంస్కృతి, సాంప్రదాయాలకు తీవ్ర విఘాతం కలగడమేనన్నారు. గతంలో విజయవాడ కనకదుర్గమ్మ కిరీటాన్ని కూడా మాయం చేశారని ఈ సందర్భంగా భూమన పేర్కొన్నారు. ఆదివారం ప్రెస్‌కాన్పరెన్స్‌లో భూమన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు హయాంలో ఆలయాల ప్రతిష్ట దిగజారుతుందని విమర్శించారు. ‘చంద్రబాబు పాలనలో భగవంతుని పట్ల తీరని అపచారం జరుగుతోంది. భక్తులు సమర్పించిన నగలన్నీ ఎత్తుకెళ్లారని ప్రధాన అర్చకుడే ఆరోపణలు చేశారు. పింక్ డైమండ్‌ను చోరీ చేశారని.. ఇతర దేశాల్లో విక్రయించారని ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకున్నారే కానీ న్యాయ విచారణకు ఎందుకు ఆదేశించలేదు. చంద్రబాబుపై ఆరోపణలు చేస్తే వారిని సంఘ ద్రోహులుగా చిత్రీకరించారు. విజయవాడ పరిసరాల్లోనే దేవాలయాలు నేలమట్టం అయ్యాయి. చంద్రబాబు హయాంలో 40 దేవాలయాలు నేలమట్టం చేశారు. కాళహస్తి ఆలయం, బెజవాడ దుర్గమ్మ ఆలయాల్లో క్షుద్ర పూజలు జరుగుతున్నా చర్యలు ఎందుకు లేవు. అమరావతిలోని అమరేశ్వర ఆలయ భూములను తన తాబేదార్లకు తక్కువ ధరకే చంద్రబాబు కట్టబెట్టారు. చంద్రబాబు తీరు ఇలానే ఉంటే హైందవ ధర్మాన్ని ఎవరు రక్షిస్తారు. తిరుపతిలో గోవిందరాజు స్వామి ఆలయంలో దోపిడీ జరిగింది. అంటే ఎంత దోపిడీ వ్యవస్థ నడుస్తుందో అర్థం చేసుకోవాలి’ అని భూమన ఘాటుగా ప్రశ్నించారు. -
కిరీటాల మాయంపై కీలక ఆధారాలు లభ్యం!
-
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల మాయం
-
కిరీటాల మాయంపై కీలక ఆధారాలు లభ్యం!
సాక్షి, తిరుపతి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల మాయం ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఈ కేసులో ఇప్పటికే కొన్ని ఆధారాలను సేకరించినట్టు తెలుస్తోంది. కిరీటాల మాయం వెనుక ఇంటి దొంగల పనే ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆలయ సిబ్బందే కిరీటాలు మాయం చేసి ఉంటారన్న కోణంలో విచారణ జరుపుతున్నట్టు సమాచారం. ఆలయంలోని సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులకు పలు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. సాయంత్రం 5.40 గంటల నుంచి 6 గంటల మధ్యప్రాంతంలో కిరీటాలు చోరీ అయినట్టు పోలీసులు గుర్తించారు. చోరీ జరిగిన సమయంలో ఆలయంలో అర్చకులు బాలాజీ దీక్షితులు, శ్రీనివాసులు ఉన్నట్లు తెలుస్తోంది. చోరీ జరిగిన ప్రదేశంలో సీసీటీవీ కెమెరా ఒకటి పని చేయడం లేదని గుర్తించారు. కిరీటాల మాయం కచ్చితంగా ఇంటి దొంగల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఆలయ ప్రాంగణంలో మరోసారి డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. 2011లోనూ.. టీటీడీ ఆలయాల్లో గతంలో కూడా పలుమార్లు నగలు మాయమయ్యాయి. 2011లో తిరుపతిలోని కోదండ రామస్వామి ఆలయంలోనూ నగల అపహారణ జరిగింది. ఈ కేసులో ఇప్పటికీ కూడా విచారణ కొనసాగుతూనే ఉంది. అప్పట్లో ఆలయ ప్రధాన అర్చకుడే నగలను తాకట్టు పెట్టినట్టు అధికారులు నిర్ధారించారు. అంతేకాదు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో సైతం గతంలో నగలు మాయమయ్యాయి. టీటీడీ ఆలయాల్లో వరుసగా జరగుతున్న నగల మాయంపై భక్తుల్లో ఆందోళన నెలకొంది. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే నగలు మాయమవుతున్నాయంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయానికి చేరుకున్న పెద్ద జీయర్, చిన జీయర్.. కిరీటాల చోరీ నేపథ్యంలో తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయానికి పెద్ద జీయర్, చిన జీయర్ చేరుకున్నారు. మరోవైపు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల మాయం కావడంలో బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో స్వామి వారి నగలకు భద్రత లేదంటూ దేవాలయం ముందు నిరసనకు దిగారు. కిరీటాల మాయంపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని, టీటీడీ అనుబంధ ఆలయాల్లో భద్రతను పటిష్టం చేయాలని బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
తిరుపతి: మూడు బంగారు కిరీటాలు మాయం
సాక్షి, తిరుపతి : తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ మూర్తులకు అలంకరించే మూడు బంగారు కిరీటాలు మాయం అయ్యాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై శనివారం రాత్రి టీటీడీ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. శ్రీవేంకటేశ్వరస్వామి అన్నగారైన శ్రీగోవిందరాజస్వామి ఆలయాన్ని 12వ శతాబ్దంలో శ్రీరామానుజాచార్యులు నిర్మించారు. తిరుమల కొండకు వచ్చిన ప్రతి భక్తుడు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామిని దర్శించుకుంటారు. శ్రీవారికి సమర్పించినట్టే గోవిందరాజస్వామికి కూడా రాజులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బంగారు, వజ్రాలతో పొదిగిన ఆభరణాలు, వజ్రవైఢూర్యాలతో పొదిగిన కిరీటాలు కానుకలుగా సమర్పించారు. కాగా శ్రీగోవిందరాజస్వామికి ప్రధానంగా ఐదు బంగారు కిరీటాలు ఉన్నట్లు సమాచారం. అయితే నిత్యం స్వామి వారికి అలంకరించి ఉండే మూడు కిరీటాలు మాయమయ్యాయి. మాయమైన మూడు కిరీటాలను ‘సదా సమర్పణ’ కిరీటాలు అని అంటారు. వజ్రాలతో తయారు చేయించిన ఈ కిరీటాలు మూడు 1.300 కిలోలు బరువు ఉంటాయని వెల్లడించారు. నిత్యం రద్దీగా ఉండే ఆలయంలో ఉత్సవ మూర్తులకు అలంకరించే మూడు విలువైన బంగారు కిరీటాలు మాయమైన విషయం శనివారం సుప్రభాత సేవ సమయంలోనే తెలిసినట్లు సమాచారం. ఆ వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ కిరీటాలు ఆలయంలో పనిచేసే వారికి తెలియకుండా మాయమయ్యే అవకాశం లేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరు? ఎలా మాయం చేశారనే విషయంపై తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్, టీటీడీ విజిలెన్స్ అధికారులు, క్లూస్ టీం విచారణ చేపట్టారు. ఆలయంలోని సీసీ పుటేజిలను పరిశీలిస్తున్నారు. ఆలయ సిబ్బంది, అర్చకులను విచారిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం తిరుపతిలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో పనిచేసే అధికారి ఒకరు విలువైన ఆభరణాలను మాయం చేసి తాకట్టుపెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు ఇంకా విచారణ జరుగుతుండగానే... తాజాగా శ్రీగోవింద రాజస్వామి ఆలయంలో బంగారు కిరీటాలు మాయం కావడం సంచలనంగా మారింది. -
ధర్మప్రచారాన్ని విస్తృతం చేయాలి
తిరుపతి : సనాతన హిందూ ధర్మ వ్యాప్తికి టీటీడీ సాగిస్తున్న కృషి అనిర్వచనీయమైనదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ.కృష్ణమూర్తి అన్నారు. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సోమవారం జరిగే త్రైమాసిక మెట్లోత్సవాలను ఆదివారం సాయంత్రం ఉపముఖ్యమంత్రి జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవిందరాజస్వామి సత్రాల సముదాయంలో దాససాహిత్య భజన మండళ్లతో ఏర్పాటైన సమావేశంలో ఆయన ప్రసంగించారు. గ్రామ గ్రామాన యాగాలు, హోమాలు నిర్వహించి సనాతన హిందూ ధర్మాలను విశ్వవ్యాప్తం చేయాలని సూచించారు. తిరుమల శ్రీవారి మహిమలు అపారమైనవన్నారు. అందుకే కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా భావించి విదేశాల్లో సైతం వెంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మిస్తున్నారన్నారు. శేషాచల అడవుల్లో సిరులు కురిపించే అపారమైన ఎర్రచందనం చెట్లు ఉన్నాయని. ఇక్కడి ఎర్రచందనమే నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి పెట్టుబడిలో భాగస్వామి కాబోతోందన్నారు. టీటీడీ జేఈవో పోలా భాస్కర్ ప్రసంగిస్తూ భగవంతుని చేరుకోవడానికి సులభమైన మార్గం నామసంకీర్తనమని అన్నారు. దాససాహిత్యం పుట్టుక కర్ణాటక రాష్ట్రమైనా ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించిందన్నారు. ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, టీటీడీ ఎడిటర్-ఇన్-చీఫ్ రవ్వా శ్రీహరి, తిరుమల ఆలయ డెప్యూటీ ఈవో చిన్నం గారి రమణ, దాససాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి పీఆర్ ఆనందతీర్థాచార్య, టీటీడీ పీఆర్వో రవి పాల్గొన్నారు. అనంతరం తిరుపతిలో భజనమండళ్ల శోభాయాత్ర సాగింది. -
భక్తులపై దాడి చేసిన సైకో అరెస్ట్
తిరుమల : తిరుమల నడక దారిలో వెళ్తున్న భక్తులపై దాడి చేసిన ఉన్మాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని తిరుపతి క్రైం బ్రాంచ్‌కు విచారణ నిమిత్తం తరలించారు. ఈనెల 19న తమిళనాడుకు చెందిన గోవింద త్యాగరాజన్ దంపతులపై సైకో దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. నిందితుడు దక్షిణామూర్తి తమిళనాడు నాగపట్నం వాసిగా పోలీసులు గుర్తించారు. అతడు మరోసారి అలిపిరి కాలిబాటలో సంచరిస్తుండగా టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు తంజావూర్‌కు చెందిన గోవిందరాజస్వామి దంపతులు కాలినడక కొండపైకి బయలుదేరారు. ఆ దంపతులు అక్కగార్ల గుడి సమీపంలోకి రాగానే 25 ఏళ్ల యువకుడు వారిపై అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. గోవిందరాజస్వామి భార్యపై కత్తితో దూసుకువచ్చాడు. ఆ క్రమంలో ఉన్మాదిని ఆమె భర్త గోవిందరాజస్వామి అడ్డుకోబోయాడు. దాంతో ఆగ్రహించిన ఉన్మాది గోవిందరాజస్వామి గొంతు కోశాడు. ఆ తర్వాత అతడి భార్యపై దాడి చేశాడు.ఆ ఘటనలో దంపతులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో వారిని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. -
దాడి చేసింది ఉన్మాది కాదు... చైన్ స్నాచర్!
తిరుమల నడక దారిలో వెళ్తున్న భక్తులపై దాడి చేసింది ఉన్మాది కాదని చైన్ స్నాచర్‌గా అనుమానిస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ అధికారి హన్మంతు వెల్లడించారు. బంగారం, నగదు కోసమే ఆ దాడి చేసి ఉంటాడని తాము భావిస్తున్నామని తెలిపారు. దాడి నేపథ్యంలో పాత నేరస్థుల వివరాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే ఉన్మాది దాడిలో గాయపడిన ఘటనలో దంపతులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని రుయా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించామని... అయితే 72 గంటల పాటు ఇద్దరూ అబ్జర్వేషన్లో ఉంచాలని తెలిపారు. అప్పడే ఆ దంపతుల ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వస్తుందని వైద్యులు సాక్షి మీడియాకు వెల్లడించారు. భక్తులపై దాడి ఘటన దురదృష్ణకరమని టీటీడీ ఈవో ఎం.జి.గోపాల్ వెల్లడించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు తీవ్ర తరం చేసినట్లు తిరుపతి అర్భన్ ఎస్పీ రాజశేఖరబాబు వెల్లడించారు. తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు తంజావూర్‌కు చెందిన గోవిందరాజస్వామి దంపతులు కాలినడక ఈ రోజు తెల్లవారుజామున కొండపైకి బయలుదేరారు. ఆ దంపతులు అక్కగార్ల గుడి సమీపంలోకి రాగానే 25 ఏళ్ల యువకుడు వారిపై అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. గోవిందరాజస్వామి భార్యపై కత్తితో దూసుకువచ్చాడు. ఆ క్రమంలో ఉన్మాదిని ఆమె భర్త గోవిందరాజస్వామి అడ్డుకోబోయాడు. దాంతో ఆగ్రహించిన ఉన్మాది గోవిందరాజస్వామి గొంతు కోశాడు. ఆ తర్వాత అతడి భార్యపై దాడి చేశాడు.ఆ ఘటనలో దంపతులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఉన్మాది అక్కడి నుంచి పరారైయ్యాడు. భక్తులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. -
రేపటి నుంచి గోవిందుడి బ్రహ్మోత్సవాలు
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్ : తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ అధికారులు పూర్తి చేశారు. బుధవారం నుంచి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. మంగళవారం సాయంత్రం నిర్వహించే అంకురార్పణతో ఉత్సవాలకు నాంది పలుకనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయం వద్ద గోవిందరాజస్వామి ప్రతిరూపాలతో కూడిన విద్యుత్ కటౌట్లను, చలువ పందిళ్లను, క్యూలను ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో స్వామి నామం వినిపించేలా చర్యలు తీసుకున్నారు. వాహన సేవలను భక్తులు తిలకించేందుకు వీలుగా రైల్వేస్టేషన్, విష్ణునివాసం, గోవిందరాజస్వామి పుష్కరిణి ప్రాంతాల్లో ప్రత్యేకంగా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. అలాగే టీటీడీ ప్రచురణల విక్రయశాల, ప్రథమ చికిత్సా కేంద్రం, ఆయుర్వేద వైద్యశిబిరం సైతం ఏర్పాటు చేశారు. కాగా, స్వామి వాహన సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆలయ మాడా వీధుల్లోని రోడ్లపై ఏర్పాటు చేసిన దుకాణాలను టీటీడీ విజిలెన్స్ అధికారుల ఆధ్వర్యంలో తొలగించే కార్యక్రమాలు చేపట్టారు.