
సాక్షి, తిరుపతి: శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి విఫలయత్నం జరిగింది. ఆలయంలోని హుండీలు ఎత్తుకెళ్లేందుకు దొంగ యత్నించాడు. హుండీ తాళానికి వేసిన లక్క, క్లాత్‌ని మాత్రమే తొలగించిన ఆ దొంగ ప్రయత్నాలు ఫలించలేదు. సీసీ కెమెరాల్లో ఆ దుండగుడు దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులు, టీటీడీ విజిలైన్స్ అధికారులు సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. రాత్రి తొమ్మిది గంటలకు ఆలయాన్ని మూసివేసిన తర్వాత దొంగతనానికి ప్రయత్నించినట్టు అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment