షిర్డీలో ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారు.
థానె: షిర్డీలో ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారు. ఇటీవల మహారాష్ట్రలోని సాహాపూర్ జిల్లా హడవేలి గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువతిని ముగ్గురు వ్యక్తులు షిర్డీకి తీసుకెళ్లారు. గోరక్, రాహుల్ అనే ఇద్దరు వ్యక్తులతో మరో గుర్తు తెలియని మహిళను ఆ యువతి వెంట ఉన్నారు.
షిర్డీలో మూడు రోజుల పాటు బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం హత్య చేసి సమీపంలోని నదిలోకి విసిరేశారు. స్థానికులు యువతి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.