షిరిడీకి విమాన ప్రయాణం | Air travel to Shirdi soon | Sakshi
Sakshi News home page

షిరిడీకి విమాన ప్రయాణం

Published Fri, Mar 18 2016 3:36 PM | Last Updated on Mon, Oct 8 2018 6:05 PM

Air travel to Shirdi soon

ఎంతో కాలంగా సాయి భక్తులు ఎదురు చూస్తున్న షిర్డీకి విమాన ప్రయాణం కల త్వరలో సాకారం అవుతోంది. షిర్డీకి సమీపంలో మహారాష్ట్ర ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కంపెనీ (ఎంఏడీసీ) విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయనుంది. రన్‌వే, ట్యాక్సీ వే, టెర్మినల్ నిర్మాణం పూర్తి అయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తోపాటు నీరు, విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేయాల్సి ఉంది.

 

2,500 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో రన్‌వే ఏర్పాటైంది. విమానాశ్రయంలో ఈ ఏడాది ఆగస్టు నుంచి ప్రై వేటు విమానాలకు అనుమతి ఇవ్వనున్నారు. జనవరి నుంచి వాణిజ్య అవసరాలకు ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రానుందని ఎంఐడీసీ అధికారులు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ప్రస్తుతం షిర్డీకి రైలు సౌకర్యం కూడా ఉంది. విమానాశ్రయం ప్రారంభమైతే వేలాది మంది భక్తులకు పెద్ద ఊరట లభించనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement