ముంబై: మహమ్మారి కరోనా వైరస్ మహారాష్ట్రలో కల్లోలం రేపుతోంది. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో మహారాష్ట్రలో పాక్షిక లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే అందులో భాగంగా దేశంలోనే అత్యంత సంపద గల షిర్డీ సాయిబాబా ఆలయం మూతపడింది. సోమవారం రాత్రి 8 గంటలకు ఆలయం మూతపడింది.
ఈ ఆలయం మళ్లీ ఉత్తర్వులు వచ్చే వరకు మూసి ఉంటుందని ఆలయ అధికారులు ప్రకటించారు. కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా సామూహిక ప్రార్థన స్థలాలు, మందిరాలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ మేరకు షిర్డీ ట్రస్టీ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు మహారాష్ట్రలో 30,10,597 కేసులు నమోదవగా 55,878 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసులు 4,30,503.
Comments
Please login to add a commentAdd a comment