Shirdi Saibaba temple
-
లాక్డౌన్ ఎఫెక్ట్ షిర్డీ ఆలయం మూసివేత
ముంబై: మహమ్మారి కరోనా వైరస్ మహారాష్ట్రలో కల్లోలం రేపుతోంది. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో మహారాష్ట్రలో పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే అందులో భాగంగా దేశంలోనే అత్యంత సంపద గల షిర్డీ సాయిబాబా ఆలయం మూతపడింది. సోమవారం రాత్రి 8 గంటలకు ఆలయం మూతపడింది. ఈ ఆలయం మళ్లీ ఉత్తర్వులు వచ్చే వరకు మూసి ఉంటుందని ఆలయ అధికారులు ప్రకటించారు. కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా సామూహిక ప్రార్థన స్థలాలు, మందిరాలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ మేరకు షిర్డీ ట్రస్టీ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు మహారాష్ట్రలో 30,10,597 కేసులు నమోదవగా 55,878 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసులు 4,30,503. -
ప్లీజ్.. సంప్రదాయ దుస్తుల్లో రండి: షిర్డి
ముంబై: బాబా దర్శనానికి వచ్చే వారు భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి రావాల్సిందిగా షిర్డి సాయిబాబా ఆలయ ట్రస్టు నిర్వహకులు భక్తులను అభ్యర్థించారు. ఇది కేవలం అభ్యర్థన మాత్రమే అని.. భక్తులపై ఎలాంటి డ్రెస్ కోడ్ విధించలేదని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కన్హురాజ్ బాగటే మాట్లాడుతూ.. ‘బాబాను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే గతంలో కొందరి వస్త్రధారణ పట్ల పలవురు భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరకర దుస్తులు ధరించి ఆలయంలోకి వచ్చారని కొందరు ఫిర్యాదు చేశారు. అందుకే ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది పవిత్రమైన పుణ్యక్షేత్రం. కనుక మోడర్న్ దుసుల్లో వచ్చే వారికి మా విజ్ఞప్తి ఇదే.. దయచేసి భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి రండి. ఇది కేవలం విన్నపం మాత్రమే. భక్తుల మీద ఎలాంటి డ్రెస్ కోడ్ విధంచలేదు’ అని తెలిపారు. (చదవండి: సమసిన షిర్డీ వివాదం) -
లాక్డౌన్: షిర్డీ ఆలయంపై భారీ ఎఫెక్ట్!
ముంబై : కరోనా వైరస్‌ను కట్టడి చేయటానికి విధించిన లాక్డౌన్ కారణంగా మనుషులు, ఇతర జీవులే కాదు.. దేవుడికి కూడా కష్టాలు తప్పటం లేదు. అన్ని ఆలయాలు దర్శనాలను నిలిపివేయటంతో పెద్ద మొత్తంలో ఆదాయాలకు గండిపడుతోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన షిర్డీ సాయి బాబా ఆలయం భక్తుల రాకపోకలు లేక బోసిపోవటమే కాకుండా నిత్యం కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తోంది. షిర్డీ సాయి బాబా మందిర్ ట్రస్టు ప్రతిరోజూ 1.58కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్ట పోతోంది. మామూలుగా ప్రతీ సంవత్సరం విరాళాల ద్వారా దాదాపు రూ. 600 కోట్లు ఆదాయం వచ్చేది. కానీ, లాక్డౌన్ కారణంగా మార్చి 17నుంచి మే 3 వరకు కేవలం రూ.2.53 కోట్ల విరాళాలు మాత్రమే వచ్చాయి. అవి కూడా ఆన్లైన్ ద్వారా. లాక్‌డౌన్‌కు ముందు ప్రతిరోజు రూ. 1.60కోట్ల విరాళాలు వస్తుండగా.. ఇప్పుడా సంఖ్య రూ.6 లక్షలకు పరిమితమయింది. ( సమసిన షిర్డీ వివాదం ) ఒక వేళ జూన్ వరకు లాక్డౌన్ కొనసాగిస్తే సాయిబాబా ఆలయం రూ.150 కోట్లు నష్టపోవాల్సి వస్తుంది. ఇదే గనుక జరిగితే గుడి నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలపై ఆ ప్రభావం పడనుంది. కాగా, కరోనా కారణంగా ప్రముఖ షిర్డీ సాయి బాబా ఆలయం మార్చి 17నుంచి బాబా దర్శనాన్ని నిలిపి వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజుకు 8-9 మంది భక్తులు మాత్రమే ఆన్లైన్ ద్వారా సాయిని దర్శించుకుంటున్నారు. -
సమసిన షిర్డీ వివాదం
సాక్షి, ముంబై: పాథ్రీ గ్రామాన్ని సాయిబాబా జన్మస్థలంగా కాక, ఒక పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రకటనతో బాబా జన్మస్థలంపై తలెత్తిన వివాదం సమసినట్లయింది. సాయిబాబా జన్మస్థలమైన పాథ్రీ గ్రామాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రకటనతో షిర్డీ వాసులు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. షిర్డీలోని దుకాణాలను మూసివేయడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి తీవ్రతను గమనించిన సీఎం ఉద్ధవ్ సోమవారం షిర్డీ, పాథ్రీ గ్రామాల ప్రముఖులు, షిర్డీ ఆలయ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం ఉద్ధవ్ పాథ్రీ గ్రామాన్ని సాయిబాబా జన్మస్థలంగా కాకుండా ఒక పుణ్య క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అంతేకాకుండా, పాథ్రీ సాయిబాబా జన్మస్ధలమంటూ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఇందుకు పాథ్రీ, షిర్డీ వాసులు సమ్మతించారు. ‘బాబా జన్మస్థలం పాథ్రీ అవునో కాదో నాకు తెలియదు. నేనేమీ పరిశోధకుణ్ని కాదు. అందరూ అన్నట్టుగానే నేనూ అన్నా’అని తెలిపారు. -
ముగిసిన షిర్డీ బంద్
సాక్షి, ముంబై/షిర్డీ: షిర్డీ సాయిబాబా జన్మస్థలంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా షిర్డీ్డలో జరుగుతున్న బంద్ ముగిసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి బంద్‌ను నిలిపివేస్తున్నట్లు శివసేనకు చెందిన స్థానిక ఎంపీ సదాశివ లోఖండే ప్రకటించారు. ఈ అంశంపై సంబంధిత వర్గాలతో సోమవారం సీఎం ఠాక్రే సమావేశం నిర్వహిస్తున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ఆయన షిర్డీ్డలోని స్థానికులతో చర్చించారు. అంతకుముందు, బంద్‌కు ఎంపీ సదాశివ లోఖండే మద్దతు ప్రకటించారు. ఠాక్రే వ్యాఖ్యలపై నిరసనగా ఆదివారం షిర్డీ్డలో బంద్ పాటించారు. శనివారం అర్ధరాత్రి నుంచి షిర్డీతో పాటు చుట్టుపక్కల ఉన్న 25 గ్రామాల్లోనూ బంద్ జరిగింది. అయితే, షిర్డీ సాయి ఆలయం తెరిచే ఉంది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే సాయినాథుని దర్శించుకున్నారు. షిర్డీ్డలోని షాపులు, రెస్టారెంట్లు, ప్రైవేటు వాహనాల వారు బంద్ పాటించారు. ముందే బుక్ చేసుకున్నవారికి మాత్రం హోటళ్లలో వసతి కల్పించారు. సాయిబాబా దర్శనం కోసం వచ్చిన భక్తులకు స్థానికులు ఆహారం, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించారు. భక్తులకు ఉపాహారం అందించే ప్రసాదాలయ, లడ్డూ కౌంటర్ల వద్ద భారీ క్యూలు కనిపించాయి. స్థానికులు, భక్తులు ఆదివారం ఉదయం ద్వారకామాయి ఆలయం నుంచి ప్రారంభించి సాయి ఆలయం చుట్టూరా భారీ ర్యాలీ నిర్వహించారు. పర్భని జిల్లాలోని పాథ్రీలో ఉన్న ‘సాయి జన్మస్థాన్’ అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించడంతో వివాదం ప్రారంభమైంది. పత్రిని అభివృద్ధి చేయడం పట్ల తమకు అభ్యంతరం లేదని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్(ఎస్ఎస్ఎస్టీ) మాజీ సభ్యుడు సచిన్ థాంబె తెలిపారు. సాయిబాబా జన్మస్థలంగా పత్రిని పేర్కొనడంపైనే తమ అభ్యంతరమని స్పష్టం చేశారు. ‘పత్రి తన జన్మస్థలమని సాయిబాబా ఎన్నడూ చెప్పలేదు’ అని వివరించారు. బంద్ కారణంగా షిర్డీకి వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గిందని రాష్ట్ర మంత్రి చగన్ భుజ్‌బల్ పేర్కొన్నారు. సాధారణం కన్నా 10 వేల మంది తగ్గారన్నారు. ఇరు గ్రామాల వారితో భేటీ ఈ అంశంపై నేడు(సోమవారం) సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశానికి షిర్డీ, çపత్రి గ్రామాల వాస్తవ్యులు, షిర్డీ ఎమ్మెల్యే విఖే పాటిల్, ఎంపీ లోఖండే హజరవుతారని ఎస్ఎస్ఎస్టీ సీఈఓ దీపక్ ముగ్లీకర్ తెలిపారు. పత్రిలో సాయిబాబా జన్మించాడని 2017లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొనడంతో.. సాయిబాబా జన్మస్థలానికి సంబంధించిన వివాదం ప్రారంభమైంది. ‘2017లో రాష్ట్రపతి షిర్డీకి వచ్చినప్పుడు షిర్డీ సాయిబాబా కర్మభూమి.. పత్రి ఆయన జన్మభూమి అని వ్యాఖ్యానించారు. ఈ విషయమై రాష్ట్రపతిని నేను ఆ తరువాత కలిసి వివరణ ఇచ్చాను. అధికారులు చెప్పిన విషయాన్నే తాను ప్రస్తావించానని అప్పుడు రాష్ట్రపతి అన్నారు’ అని లోఖండే వివరించారు. పత్రినే సాయి జన్మభూమి అని ఆ గ్రామస్తులు వాదిస్తున్నారు. సాయి జీవిత చరిత్ర ‘శ్రీ సాయిసశ్చరిత’లో కూడా çపత్రినే సాయి జన్మస్థలంగా పేర్కొన్నారని గుర్తు చేస్తున్నారు. ‘పాథ్రీనే సాయిబాబా జన్మస్థలమని ఆయన శిష్యుడు దాసు గణు మహారాజ్ తన జీవిత చరిత్రలో పేర్కొన్నారు. షిర్డీ సంస్థాన్ కూడా çపత్రినే సాయిబాబా జన్మస్థలమని నిర్ధారిస్తూ కొన్ని పత్రాలు ప్రచురించింది’ అని పత్రిలోని ‘శ్రీ సాయి జన్మస్థాన్ టెంపుల్ ట్రస్ట్’ సభ్యుడు సంజయ్ భూసారి వెల్లడించారు. -
‘రేపటి నుంచి సాయిబాబా ఆలయం బంద్’
ఔరంగాబాద్ : షిర్డీ సాయిబాబా జన్మస్థలంపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సాయిబాబా జన్మ స్థలమని కొందరు భక్తులు నమ్మే పర్భనీ జిల్లాలోని పత్రి పట్టణ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై షిర్డీ వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చేపట్టారు. షిర్డీ సాయి జన్మస్థలం విషయమై రాజకీయ జోక్యం తగదని స్పష్టం చేశారు. ఇక పత్రీని సాయిబాబా స్వస్థలంగా అభివృద్ధి చేస్తామన్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటనకు నిరసనగా షీర్డీ సంస్థాన్ ట్రస్టు, గ్రామస్తులు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే, షిర్డీని సందర్శించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని సాయి సంస్థాన్ ట్రస్టు సభ్యుడు బి.వాక్చౌర్ వెల్లడించారు. ‘షిర్డీ సాయి జన్మస్థలంపై వస్తున్న పుకార్లకు నిరసనగా.. ఆదివారం (జనవరి 19) నుంచి ఆలయాన్ని మూసివేసేందుకు నిర్ణయించాం’అన్నారు. ఇక ఇదే అంశంపై షిర్డీ ప్రజలతో శనివారం సాయంత్రం సమావేశమవుతామని పేర్కొన్నారు. -
బాబా సన్నిధిలో మహేశ్‌బాబు
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు షిర్టీ సాయిబాబాను దర్శించుకున్నారు. ఫ్యామిలీతో కలిసి షిర్డీ వెళ్లిన మహేశ్.. బాబా ఆశీస్సులు తీసుకున్నారు. వారి వెంట దర్శకుడు మెహర్ రమేశ్ కూడా ఉన్నారు. త్వరలో మహేశ్ తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే తన పాత్రకు డబ్బింగ్ చెప్పేసిన మహేశ్.. వారం రోజుల పాటు ఫ్యామిలీతో గడపాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన షిర్డీ ఆలయానికి వెళ్లారు. అలాగే మరో వారం రోజుల తర్వాత మహేవ్.. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోతారు. మహేశ్‌బాబు సరసన రష్మికా మందన్నా నటించిన ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర చేశారు. హైదరాబాద్‌లో జనవరి 5న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుక జరగనుంది. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది. -
షిర్డీ సాయిబాబా ఆలయంలో దొంగతనం
గుంటూరు, చిలకలూరిపేటరూరల్: అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయం తాళాలు పగులకొట్టి ఆలయంలో చోరీ చేశారు. ఈ సంఘటన మండలంలోని దండమూడి గ్రామ ప్రవేశంలో ఉన్న షిర్డీ సాయిబాబా దేవాలయంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఆలయ ట్రస్టీ బుర్రా వీరాస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఆర్ అండ్ బీ రహదారి సమీపంలో ఉన్న సాయిబాబా, దుర్గాదేవి ఆలయ ప్రధాన గేట్లు తాళాలు ధ్వంసం చేసి ఆలయంలోని హుండీని పగులకొట్టి అందులోని రూ.5,000 నగదు, సీసీ కెమారాల బాక్స్, టీవీలను చోరీ చేసినట్టు తెలిపారు. సమాచారం తెలుసుకున్న రూరల్ సీఐ ఎస్.విజయ చంద్ర, ఎస్ఐ పి.ఉదయ్‌బాబు శుక్రవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని ఆలయాన్ని పరిశీలించారు. అనంతరం క్లూస్‌టీం బృందం వేలిముద్రలను నమోదు చేశారు. డాగ్ స్క్వాడ్ ఆలయం వద్ద నుంచి మానుకొండవారిపాలెం వెళ్లింది. అక్కడి నుంచి వేలూరు మీదుగా చిలకలూరిపేటకు చేరింది. ఈ మేరకు వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ పోలీసులు తెలిపారు. -
శిరిడి ఆలయాన్ని టీటీడీకి అప్పగించాలి: రాజ్ ఠాక్రే
శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోన్న శిరిడి సాయిబాబా ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అన్నారు. ట్రస్ట్ పని తీరు అత్యంత దారుణంగా ఉందని, భక్తులకు కనీస అవసరాలు అందించడంలో విఫలమైందని ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ తీరు అద్భుతంగా ఉంటుందని, అందుకే తాను డిమాండ్ ను లేవనెత్తానని ఠాక్రే వివరించారు. ఆదివారం శిరిడి ఆలయానికి వచ్చిన ఆయన బాబా దర్శనం అనంతరం విలేకరులతో మాట్లాడారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఎలా పనిచేస్తుందన్న ప్రశ్నకు.. 'మంచి రోజులు (అఛ్చే దిన్) ఇంకా రాలేదు.. వాటికోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారు' అని బదులిచ్చారు.