ముంబై : కరోనా వైరస్‌ను కట్టడి చేయటానికి విధించిన లాక్‌డౌన్ కారణంగా మనుషులు, ఇతర జీవులే కాదు.. దేవుడికి కూడా కష్టాలు తప్పటం లేదు. అన్ని ఆలయాలు దర్శనాలను నిలిపివేయటంతో పెద్ద మొత్తంలో ఆదాయాలకు గండిపడుతోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన షిర్డీ సాయి బాబా ఆలయం భక్తుల రాకపోకలు లేక బోసిపోవటమే కాకుండా నిత్యం కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తోంది. షిర్డీ సాయి బాబా మందిర్ ట్రస్టు ప్రతిరోజూ 1.58కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్ట పోతోంది. మామూలుగా ప్రతీ సంవత్సరం విరాళాల ద్వారా దాదాపు రూ. 600 కోట్లు ఆదాయం వచ్చేది. కానీ, లాక్‌డౌన్ కారణంగా మార్చి 17నుంచి మే 3 వరకు కేవలం రూ.2.53 కోట్ల విరాళాలు మాత్రమే వచ్చాయి. అవి కూడా ఆన్‌లైన్ ద్వారా. లాక్‌డౌన్‌కు ముందు ప్రతిరోజు రూ. 1.60కోట్ల విరాళాలు వస్తుండగా.. ఇప్పుడా సంఖ్య రూ.6 లక్షలకు పరిమితమయింది. ( సమసిన షిర్డీ వివాదం )
ఒక వేళ జూన్ వరకు లాక్‌డౌన్ కొనసాగిస్తే సాయిబాబా ఆలయం రూ.150 కోట్లు నష్టపోవాల్సి వస్తుంది. ఇదే గనుక జరిగితే గుడి నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలపై ఆ ప్రభావం పడనుంది. కాగా, కరోనా కారణంగా ప్రముఖ షిర్డీ సాయి బాబా ఆలయం మార్చి 17నుంచి బాబా దర్శనాన్ని నిలిపి వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజుకు 8-9 మంది భక్తులు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా సాయిని దర్శించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment