శిరిడి ఆలయాన్ని టీటీడీకి అప్పగించాలి: రాజ్ ఠాక్రే | Saibaba temple trust should be handed over to Tirumala Tirupati Devasthanam says Raj Thackeray | Sakshi
Sakshi News home page

శిరిడి ఆలయాన్ని టీటీడీకి అప్పగించాలి: రాజ్ ఠాక్రే

Published Sun, Apr 26 2015 8:18 PM | Last Updated on Sun, Sep 3 2017 12:56 AM

శిరిడి ఆలయాన్ని టీటీడీకి అప్పగించాలి: రాజ్ ఠాక్రే

శిరిడి ఆలయాన్ని టీటీడీకి అప్పగించాలి: రాజ్ ఠాక్రే

శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోన్న శిరిడి సాయిబాబా ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అన్నారు. ట్రస్ట్ పని తీరు అత్యంత దారుణంగా ఉందని, భక్తులకు కనీస అవసరాలు అందించడంలో విఫలమైందని ఆరోపించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ తీరు అద్భుతంగా ఉంటుందని,  అందుకే తాను డిమాండ్ ను లేవనెత్తానని ఠాక్రే వివరించారు. ఆదివారం శిరిడి ఆలయానికి వచ్చిన ఆయన బాబా దర్శనం అనంతరం విలేకరులతో మాట్లాడారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఎలా పనిచేస్తుందన్న ప్రశ్నకు.. 'మంచి రోజులు (అఛ్చే దిన్) ఇంకా రాలేదు.. వాటికోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారు' అని బదులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement