
గోడపై సాయిబాబా ఆకృతి
సాక్షి, ముంబై: షిర్డీలోని ద్వారకా మాయిలోని ఓ గోడపై బుధవారం అర్ధరాత్రి సాయిబాబా ఆకృతి (చిత్రం) కన్పించదని ఓ భక్తుడు తెలపడంతో షిర్టీ పరిసరాల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. సుమారు మూడు గంటలపాటు సాయిబాబా చిత్రం కన్పించిందని స్థానికులు చెబుతున్నారు.
సాయిబాబా దర్శనమిచ్చిన ద్వారకామాయిలోని గోడను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున షిర్డీకి చేరుకున్నారు. అయితే ఇలాంటిదేమి ఉండదని కొందరు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు షిర్డీ సాయిబాబా సంస్థాన్ మాత్రం ఈ విషయంపై అధికారికంగా ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.