మహారాష్ర్టలోని నాసిక్‌లో ప్రమాదానికి గురైన తెలుగు మహిళల బృందం తిరిగి సొంతగూటికి చేరుకుంది. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన 18 మహిళల బృందం గత శుక్రవారం షిరిడీ సాయి నాధుని దర్శనం కోసం వెళ్లారు.
దర్శనం అనంతరం సోమవారం ఉదయం అక్కడి నుంచి నాసిక్ వెళ్తుండగా.. వీళ్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతుండగా.. తాజాగా ఈ రోజు అందుంలో నుంచి 13 మంది మహిళలు తిరిగి రాజమండ్రికి చేరుకున్నారు. మిగతా ఐదుగురు పరిస్థితి ఇంకా విషమంగానే ఉండటంతో.. నాసిక్‌లోనే చికిత్స పొందుతున్నారు.