మహారాష్ట్ర: బస్సు మరమ్మతుకు గురైందంటూ ప్రయాణికులను మార్గం మధ్యలోనే దింపేశారు ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సిబ్బంది. ధనుంజయ ట్రావెల్స్‌కు చెందిన ఏపీ 02పీఏ 2259 నెంబరు గల బస్సు హైదరాబాద్ నుంచి శుక్రవారం రాత్రి షిర్డీకి బయల్దేరింది. షోలాపూర్ చేరగానే బ్రేక్ డౌన్ అయిందని చెప్పి అందులోని ప్రయాణికులను సిబ్బంది దింపేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో 40మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, రాత్రే 2 గంటలు ఆలస్యంగా బయల్దేరిందని, బస్సు ఆగిపోయిన తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment