private travells slipped
-
ప్రయాణికులను మధ్యలోనే దింపేసిన ట్రావెల్స్
మహారాష్ట్ర: బస్సు మరమ్మతుకు గురైందంటూ ప్రయాణికులను మార్గం మధ్యలోనే దింపేశారు ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సిబ్బంది. ధనుంజయ ట్రావెల్స్‌కు చెందిన ఏపీ 02పీఏ 2259 నెంబరు గల బస్సు హైదరాబాద్ నుంచి శుక్రవారం రాత్రి షిర్డీకి బయల్దేరింది. షోలాపూర్ చేరగానే బ్రేక్ డౌన్ అయిందని చెప్పి అందులోని ప్రయాణికులను సిబ్బంది దింపేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో 40మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, రాత్రే 2 గంటలు ఆలస్యంగా బయల్దేరిందని, బస్సు ఆగిపోయిన తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. -
ట్రావెల్స్ బస్సు బోల్తా.. నలుగురి పరిస్థితి విషమం
కొత్తచెరువు (అనంతపురం) : అనంతపురం జిల్లా కొత్తచెరువు మండలం కొడపగాని పల్లె వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. షిరిడి నుంచి కర్ణాటకలోని బాగేపల్లికి తిరుగు ప్రయాణంలో బస్సు కనగానిపల్లె సమీపంలో అదుపు తప్పి, రోడ్డు పక్కనున్న కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అనంతపురం, పుట్టపర్తిలోని ఆస్పత్రులకు తరలించారు.