
మహారాష్ట్ర షోలాపూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురు ప్రయాణికులు సజీవ దహనం అయినట్లు సమాచారం
షోలాపూర్ : మహారాష్ట్ర షోలాపూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురు ప్రయాణికులు సజీవ దహనం అయినట్లు సమాచారం. తెలంగాణ ఆర్టీసీ బస్సు పండరీపూర్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం అయిదు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బ్యాటరీల లోడ్‌తో వెళుతున్న ఓ ట్రక్కును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సుతో పాటు లారీ కూడా దగ్ధం అయింది. మరోవైపు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం షోలాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే సుమారు పదిమందికి గాయాలు అయ్యాయని, మృతులు ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర‍్తి వివరాలు తెలియాల్సి ఉంది.