షిర్డీ: ప్రసిద్ధ షిర్డీ సాయిబాబా సన్నిధిలో బాబాకు నిత్యం చేసే హారతి సేవల్లో పాల్గొనే వీఐపీ భక్తుల టికెట్ల రుసుమును ఆలయ సంస్థాన్ బోర్డు భారీగా పెంచింది. ఉదయం 4.30 గంటలకు ఇచ్చే కాగడ హారతిలో పాల్గొనే వీఐపీలకు ఒక్కొక్కరికీ రూ.500, మధ్యాహ్నం(12 గం.), సాయంత్రం(7 గం.), రాత్రి(10.30గం.)ల హారతుల్లో పాల్గొనే వారికి రూ.300 టికెట్ ధరలుగా నిర్ణయించింది. ఈ పెంపు సోమవారం నుంచి అమల్లోకి రానుంది.