తొలితరం తెలంగాణ గజల్ గాయకుడు పండిట్ శివపూర్కర్ విఠల్‌రావు (86) అదృశ్యం మిస్టరీ విషాదాంతమైంది. అద్భుతమైన గాత్రంతో దశాబ్దాలకు పైగా సాహితీ ప్రియులను అలరించిన ఆయన చివరికి అనామకుడిలా మరణించారు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న విఠల్‌రావు మే 29న షిర్డీలో కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఆచూకీ కోసం పోలీసులు, కుటుంబసభ్యులు తీవ్రంగా వెతుకుతున్నారు. ఈ నెల 24న హైదరాబాద్‌లోని బేగంపేట కంట్రీ క్లబ్ ఫ్లై ఓవర్ కింద అపస్మారక స్థితిలో పడి ఉన్న విఠల్‌రావును స్థానికులు యాచకునిగా భావించి 108కు సమాచారమిచ్చారు.