vithal rao
-
ప్రజారోగ్యానికి పూర్తి భరోసా
సాక్షి, అమరావతి: గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగంలో సమూల మార్పులు వచ్చాయని వైద్యవిద్య పూర్వపు అదనపు సంచాలకులు (ఏడీఎంఈ) డాక్టర్ నత్తా శ్రీనివాస విఠల్‌రావు చెప్పారు. 2019కు ముందు ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితులు ఎంతో అధ్వానంగా ఉండేవని, అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆస్పత్రులు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ నుంచి ఏడీఎంఈ వరకూ వివిధ హోదాల్లో 35 ఏళ్ల పాటు వైద్య శాఖలో పనిచేసిన తాను ఎన్నడూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి ఇంత ప్రాధాన్యత ఇవ్వడం చూడలేదన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా లేకుండా పెద్ద ఎత్తున నియామకాలు, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ బలోపేతం, ఫ్యామిలీ డాక్టర్ విధానం, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాల ద్వారా ప్రజారోగ్యానికి పూర్తిస్థాయిలో భద్రత కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ రంగంలో వచి్చన మార్పులు, వాటి ఫలితంగా మెరుగుపడిన వైద్య సేవలు తదితర అంశాలపై విఠల్‌రావు తన అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. అప్పట్లో ప్రసవాలకు ఆయాలే దిక్కు.. 2019కు ముందు వరకూ ప్రభుత్వాస్పత్రుల్లో ఎంతో దారుణమైన పరిస్థితులను మేం చూశాం. తీవ్రమైన మానవ వనరుల కొరత ఉండేది. పిల్లల వైద్య విభాగంతో పాటు, అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉండేది. విజయవాడ జీజీహెచ్‌లో పిల్లల వైద్య విభాగంలో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ (విభాగాధిపతి)గా పనిచేశాను. వైద్య పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వానికి ఎన్ని ప్రతిపాదనలు పంపినా అప్పట్లో పట్టించుకునే వారు కాదు. ఉన్నతాధికారులను ఎప్పుడు అడిగినా ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతులు రావాల్సి ఉందనే సమాధానాలే మాకు ఎదురయ్యేవి. అప్పట్లో ఆస్పత్రిలో దారుణమైన పరిస్థితులకు ఒక ఉదాహరణ చెబుతా.. విజయవాడ జీజీహెచ్ గైనిక్ విభాగంలో పేషెంట్ లోడ్ విపరీతంగా ఉంటుంది. ఇంతటి కీలకమైన విభాగంలో వైద్యులు, స్టాఫ్ నర్సులు సరిపడా ఉండేవారు కాదు. ఒక్కోసారి లేబర్ రూమ్‌లో ఒక స్టాఫ్ నర్సు, మిగిలిన నాలుగైదు వార్డులకు ఒక స్టాఫ్ నర్సు ఉండాల్సి వచ్చేది. వైద్యులు సరిపడా లేకపోవడంతో ఏఎన్ఎంలు, ఆయాలే ప్రసవాలు చేసేవారు. ప్రజలకు తప్పిన వ్యయ ప్రయాసలు.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను మన రాష్ట్రంలోనే అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమాల్లో ఎంబీబీఎస్, స్పెషలిస్ట్ వైద్యులే ప్రజల వద్దకు వెళ్లి సేవలందిస్తున్నారు. ఇది ప్రజారోగ్య రంగంలో ఒక విప్లవం అనే చెప్పొచ్చు. పల్లెల్లో రైతులు, కూలిపనులు చేసుకునే నిరుపేదలు తమకేదైనా చిన్న ఆరోగ్య సమస్య వస్తే ఒక రోజంతా ఉపాధిని వదులుకుని వ్యయ ప్రయాసలతో ఆస్పత్రులకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తారు. సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. వైద్యులే గ్రామాలకు వెళ్తుండడంతో చాలావరకు జబ్బులు ప్రాథమిక దశలోనే గుర్తించడంతోపాటు సకాలంలో వైద్య సేవలందుతున్నాయి. ఇప్పుడు ప్రజలకు చాలావరకూ ఆస్పత్రులకు వెళ్లే అవసరాలు తప్పాయి. అంతేకాక.. ఈ ప్రభుత్వంలోనే ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఈవెనింగ్ క్లినిక్‌లు కూడా ప్రవేశపెట్టారు. ఈ విధానంతో ప్రజలకు చాలా మేలు చేకూరుతోంది. ఎందుకంటే సాధారణంగా పెద్దాస్పత్రులకు దూర ప్రాంతాల నుంచి బాధితులు వస్తుంటారు. వారికి ఉదయం ఓపీ చూసిన వైద్యుడు ఏవైనా పరీక్షలకు సిఫారసు చేస్తే ఆ ఫలితాలు సాయంత్రానికి వస్తాయి. ఈవెనింగ్ క్లినిక్‌కు హాజరయ్యే వైద్యులు ఫలితాలను విశ్లేíÙంచి మందులు ఇవ్వడం లేదా వార్డులో అడ్మిట్ చేయడం వంటివి చేస్తున్నారు. అడిగిన పోస్టు లేదనకుండా భర్తీ.. 2019 తర్వాత ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితులు సమూలంగా మారడానికి ప్రధాన కారణం సిబ్బంది కొరత సమస్య పరిష్కారం కావడం. ప్రభుత్వాస్పత్రిలో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా ‘జీరో వేకెన్సీ’ పాలసీని తెచ్చి 2019కి ముందు వరకూ ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు, పెరిగిన రోగుల తాకిడికి అనుగుణంగా కొత్త విభాగాల ఏర్పాటు, పెద్ద ఎత్తున పోస్టులు మంజూరు చేసి ఈ ప్రభుత్వం భర్తీ చేసింది. వైద్యుల నుంచి క్లాస్‌ఫోర్ ఉద్యోగుల వరకూ ఏ విభాగంలో అయినాసరే అడిగిన పోస్టు కాదనకుండా భర్తీ చేశారు. ఇప్పుడు వార్డులు, ఆపరేషన్ థియేటర్లలో ఎక్కడికక్కడ సరిపడా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. రోగులకు వైద్యసేవల కల్పన మెరుగుపడింది. అంతేకాదు.. మందులు, సర్జికల్స్, వైద్య పరికరాలు పుష్కలంగా ఆస్పత్రులకు సమకూర్చారు. ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు అందించడానికి ప్రస్తుత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఒకప్పుడు పీజీ సీట్ల కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేస్తే వసతులలేమి కారణంగా మంజూరయ్యేది కాదు. ఇప్పుడు పూర్తిస్థాయిలో పోస్టుల భర్తీ, అన్ని రకాల వసతుల కల్పన వల్ల గణనీయంగా పీజీ సీట్లు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పెరిగాయి. -
విఠల్రావ్ను ‘స్మృతి’ద్దాం!
అందరి కోసం కనులు నవ్వు తాయి/నాకోసం కాటుక ఏడుస్తుంది (సబ్ కె లియె ఆంఖే హస్ తీ హై/ మేరే లియే కాజ ల్ రోతా హై) తాను తరచూ ఆలపించే గజల్ చరణం పండిట్ విఠల్ రావ్ శివ్పుర్కార్కు వర్తించడం ఎంత విషాదం! ‘సుకవి జీవించు ప్రజల నాల్కల మీద’ అన్నట్లుగా హైద్రాబాద్ స్టేట్ కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు మగ్దుం మొహియుద్దీన్ రచన ‘ఏక్ చమేలీ కె తలే’ను విఠల్‌రావు గాత్రంలో వినని గజల్ ప్రియులు లేరు! మే 29న షిర్డీలో విఠల్‌రావు తప్పిపోయారు. మరు సటి రోజు రాష్ట్రప్రభుత్వం వివిధరంగాల ప్రముఖులకు తెలంగాణ అవార్డులను ప్రకటించింది. జూన్ 2న పెరేడ్ గ్రౌండ్స్‌లో అవార్డు స్వీకరించేందుకు విఠల్రావూ వస్తారని అందరూ ఎదురు చూశారు. రాలేదు! ఎందుకు? అప్పుడు తెలిసింది... విస్మృత వ్యాధి! ఆయన అల్జీమర్స్ డిసీజ్(ఎడి)కు గురైనారని, తప్పిపో యారని! జూన్ 27న విఠల్‌రావు అనామకుడిగా ‘గాంధీ’ మార్చురీకి చేరారు! తాను జీవించి ఉండగా ప్రకటితమైన అవార్డును కుటుంబసభ్యులు వేద నాశ్రువులతో స్వీకరిం చారు! అవాంఛిత ప్రొటీన్లు మెదడులో గడ్డకట్టడం వలన అరవయ్యేళ్లు దాటిన వారికి అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవ కాశం ఉంది. వస్తువులు ఎక్కడ పెట్టిందీ గుర్తుండక పోవడంతో మొదలై స్నేహితులను, కుటుంబ సభ్యులను, స్థలాన్ని, కాలాన్ని, తనను, భాషనూ మరచిపోయే స్మృతి హీనతకు దారితీస్తుంది! ప్రాచీనస్మృతులు తప్ప వర్తమానం గుర్తుండదు! ప్రతి పది మంది వృద్ధుల్లో ఒకరికి, వయసు పెరిగే కొద్ది ప్రతి నలుగురిలో ఒకరికి వచ్చే ఈ వ్యాధికి నిర్దుష్టమైన వైద్య చికిత్స లేదు. ఈ వయసులో ఇది సహజమే అనుకుంటూ కుటుంబ సభ్యులే సంరక్షిస్తారు. ఫలితంగా పాశ్చాత్య ప్రపంచంలో వలె మన ప్రభుత్వ వైద్యశాఖ రికార్డుల్లో అల్జిమీర్స్ వ్యాధిగ్రస్తుల గణాంకాలు ఖచ్చితంగా ఉండవు. చివరి నిజాం ఆస్థాన గాయకుడు, నిజాంకు ఆయన షహజాదీ (కుమార్తె)కి, వివిధ సంస్థానాధీశులకు గజల్స్ వినిపించిన విఠల్‌రావుకు ఆ వ్యాధి ఉందని ఆయన కుటుంబ సభ్యులకు, కొందరు సన్నిహితులకు తప్ప ఇతరు లకు తెలియదు. శిష్యులకూ తెలీదు. కెనడా దేశపు అత్యు న్నత గాయనిగా జునొ అవార్డు పొందిన విఠల్‌రావు శిష్యు రాలు కిరణ్ అహ్లువాలియాకూ తెలీదు. విఠల్‌రావు శిష్యరి కం చేసిన హరిహరన్కూ తెలీదు! తెలిసినా చేయగలిగిందే మైనా ఉందా? పోలీసులకు ఫిర్యాదు చేయడం, తెలిసిన వారికి చెప్పడం, కళ్లుకాయలు కాసేలా కుటుంబసభ్యులు ఎదురుచూడడం తప్ప! సంస్థలు ఏర్పడాలి! తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 50 లక్షల మం ది వృద్ధులు వివిధ దశల అల్జిమర్స్ బాధితులని విఠల్‌రావు ఉదంతం వెలుగులో మనం గుర్తించాల్సి ఉంది. గుర్తిస్తేనే... అభివృద్ధి చెందిన దేశాల్లో వలె మనకూ అల్జి మర్స్ అసోసియేషన్స్, ఫౌండేషన్స్, ఆదు కునే యంత్రాంగం ఏర్పడతాయి. ఆయా దేశాల్లో వ్యాధికి గురైన వ్యక్తులకు తేలికగా తీసుకునేందుకు వీలుకాని కడియాలు, లాకెట్స్ అమర్చవచ్చు. అవి, సంబంధితుల ఫోన్ కాల్స్‌కు స్పందిస్తాయి. వ్యాధిగ్రస్తుడు ఎక్కడ ఉన్నదీ తెలుస్తుంది. శబ్దమూ, వెలుతురు ద్వారా పౌరసమాజం గుర్తిస్తుం ది. ఆ పరికరాల్లోని మెడికల్ రికార్డు, వైద్యు లకు ఉపకరిస్తుంది. లోకం చుట్టిన గాయకుడు... అమెరికాతో సహా అనేక యూరోప్ దేశాలు, మధ్యప్రా చ్య దేశాలు పర్యటించిన విఠల్‌రావును ఆయా దేశాల్లో స్థిరప డమని ప్రముఖులు కోరారు. తాను ఘోషామహల్ వీడ నని ఒక గజల్ (సారే ఫలక్ కీ సైర్ కియా...) ద్వారా చెప్పారు! లోకం చుట్టిన గాయకుడు అల్జీమర్స్ కారణంగా తన గూటికి చేరుకోలేకపోయారు! ‘రాత్రి నిశ్శబ్దంగా వెళ్లిపోయిందని ఒక పిచ్చివాడు ఏడ్చాడు’ అనే చరణాన్ని అభిమానులకు మిగిల్చి! ఆ సాంస్కృతిక రాయబారి పేరుతో 108 తరహాలో ఒక ‘స్మృతి’దాయక వైద్యవ్యవ స్థను ఏర్పాటు చేయడం ప్రజలందరూ హర్షించే నివాళి కాగలదు! (వ్యాసకర్త, ఇండిపెండెంట్ జర్నలిస్ట్) మొబైల్: 7680950863 - పున్నా కృష్ణమూర్తి -
విఠల్‌రావుకు కన్నీటి వీడ్కోలు
* ప్రభుత్వం తరపున రమణాచారి నివాళులు * ప్రభుత్వ అవార్డు, నగదు అందజేత హైదరాబాద్: గజల్ గానగంధర్వుడు విఠల్‌రావును కడసారి చూసేందుకు ఆయన శిష్యులు, అభిమానులు హైదరాబాద్‌లోని గోషామహల్‌కు చేరుకుని నివాళులు అర్పించారు. శనివారం అశ్రునయనాల మధ్య ఆయన నివాసం నుంచి ఆయన అంతిమయాత్ర పురానాపూల్‌లోని శ్మశానవాటిక వరకు సాగింది. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ సలహా దారు కేవీ రమణాచారి విఠల్‌రావు భౌతికకాయానికి నివాళులు అర్పించి, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటీవల రాష్ట్ర అవతరణ దినోత్సవం సం దర్భంగా ప్రభుత్వం ప్రకటించిన అవార్డు, రూ.1,16,000 నగదును ఆయన భార్య తారాబాయికి అందజేశారు. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ దేశ విదేశాలలో ప్రఖ్యాత గాయకుడిగా పేరు ప్రఖ్యాతలు అందుకున్న విఠల్‌రావు అకాల మరణం రాష్ట్రానికి తీరనిలోటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన ప్రతిభను గుర్తించి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అవార్డు, నగదుతో సత్కరించాలనుకుందన్నారు. అయితే ఆ రోజు కార్యక్రమానికి ఆయ న రాలేదని, కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పుడు వాటిని అందజేసినట్లు వివరించారు. కన్నీటి వీడ్కోలు... నిజాం కాలం నుంచి గోషామహల్లో నివాసముంటూ.. కొద్ది రోజు లుగా అదృశ్యమై అకాల మరణం చెందిన విఠల్‌రావు పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం శని వారం ఉదయం ఆయన నివాసానికి తీసుకువచ్చారు. ఆయన అభిమానులు తండోపతండాలుగా చేరుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. మధ్యాహ్నం 2గంటలకు అంతిమయాత్ర ఆయన నివాసం నుంచి బయలు దేరి శిష్యులు, అభిమానుల అశ్రునయనాల మధ్య యాత్ర మధ్యాహ్నం 3 గంటలకు పురానాపూల్ శ్మశానవాటికకు చేరుకుంది. అక్కడ పండిట్ విఠల్‌రావుకు వేలాది మంది కన్నీటి వీడ్కోలు పలికారు. -
విఠల్‌రావు విషాదాంతం