ఇది పూర్తిగా వీళ్ల షో! | mondi mogudu penki pellam program | Sakshi
Sakshi News home page

ఇది పూర్తిగా వీళ్ల షో!

Published Sun, Dec 14 2014 1:10 AM | Last Updated on Sat, Jun 2 2018 7:34 PM

ఇది పూర్తిగా వీళ్ల షో! - Sakshi

ఇది పూర్తిగా వీళ్ల షో!

రవి, లాస్య... వీళ్లిద్దరిలో ఒకరి పేరు చెప్పగానే రెండో పేరు దానంతటదే నోటి నుంచి వచ్చేస్తుంది. అంతగా పాపులర్ అయిపోయారు ఈ జంట యాంకర్లు. అందుకే వీరిద్దరి ఇమేజ్‌నీ కలిపి వాడేసుకుంటున్నారు జీ తెలుగువారు.
 
‘మొండి మొగుడు - పెంకి పెళ్లాం’ అనే ఫ్యామిలీ షోకి రవి, లాస్యలు యాంకర్లు. ఈ కార్యక్రమానికి నిజంగా వీళ్లే పెద్ద ప్లస్. రవి అందమైన మాటలు, లాస్య అల్లరి చేష్టలు షోని రక్తి కట్టిస్తున్నాయి. దానికితోడు ప్రోగ్రామ్ కూడా బాగుంది. కొందరు దంపతుల మధ్య జరిగే గేమ్ షో ఇది.

ఆడుతూ పాడుతూనే... తమ సంసారంలో దొర్లుతోన్న అపశృతులను చర్చించుకోవడం, తన మనసులో ఎప్పటి నుంచో దాచుకున్న విషయాలు ఈ వేదిక ద్వారా తమ భాగస్వామికి చెప్పుకోవడం వల్ల షోకి అందం రావడమే కాదు, వారి వ్యక్తిగత జీవితాల్లోని లోటుపాట్లను సరిదిద్దుకునే అవకాశమూ కలుగుతోంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement