Lasya Dance With Husband In Theater; Video Viral - Sakshi
Sakshi News home page

Lasya: థియేటర్లో హంగామా చేసిన లాస్య.. ఆ సినిమా చూస్తూ!

Published Sun, Aug 6 2023 6:29 PM | Last Updated on Sun, Aug 6 2023 6:42 PM

Lasya Dance With Husband - Sakshi

ప్రముఖ యాంకర్‌, బిగ్‌బాస్‌ ఫేం లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో యాంకర్‌ రవితో జతకట్టి బుల్లితెరపై అలరించిన భామ.. ఆ తర్వాత మంజునాథ్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత లాస్య యాంకరింగ్‌ గుడ్‌బై చెప్పిన లాస్య.. గృహిణిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది. ఇటీవలే రెండో బిడ్డకు జన్మనివ్వగా.. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.  అలాగే యూట్యూబ్‌ చానల్‌ను రన్‌ చేస్తుంది. ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చిన లాస్య సోషల్ మీడియాలో ఎప్పుడు చురుక్కుగ్గానే ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తోంది. 

(ఇది చదవండి:  నీ భార్యగా గర్వపడుతున్నా.. భర్తపై యాంకర్‌ లాస్య ఎమోషనల్‌ పోస్ట్‌)

తాజాగా లాస్య తన ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తన భర్తతో కలిసి థియేటర్లో హంగామా చేసింది. ఈ జంట మరింత రొమాంటిక్‌గా అందరి ముందే రెచ్చిపోయారు. ఆమె భర్త మంజునాథ్‌ థియేటర్లోనే లాస్యకు మరోసారి ప్రపోజ్‌ చేస్తూ రచ్చ చేశారు. ఇదంతా సూర్య హీరోగా నటించిన సూర్య సన్‌ఆఫ్‌ కృష్ణన్ రీ-రిలీజ్ థియేటర్లో జరిగింది. ఆ చిత్రంలోని సీన్‌ను అనుకరిస్తూ లాస్య చేసిన హంగామా చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేశారు. 

(ఇది చదవండి: 'ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది'.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్ )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement