రేడియో సిటీలో 'తొలి పరిచయం' సాంగ్ లాంచ్
పియుకే ప్రొడక్షన్స్ పతాకంపై వెంకీ, లాస్య జంటగా తెరకెక్కుతున్న సినిమా తొలి పరిచయం. ఎల్.రాధాకృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దీపక్ కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ సాంగ్ లాంచ్ సోమవారం హైదరాబాద్లో రేడియో సిటీలో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పెళ్లి అంటే ఇష్టం లేని ఒక అమ్మాయి, అబ్బాయి ఒకే ఇంట్లో గడపాల్సి వస్తే... ఆ తర్వాత ఏమి జరిగింది అన్నది చిత్ర కథాంశం. పోలవరం ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలోనే ఆడియో రిలీజ్, సినిమా రిలీజ్ డేట్లను ఎనౌన్స్ చేయనున్నారు చిత్రయూనిట్.