ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్
సాక్షి, హైదరాబాద్: రామా టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్టర్ మైండ్స్ ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టోర్నీ బాలికల అండర్-14లో లాస్య, సంజన రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. ఆదివారం జరిగిన తొలి రౌండ్ పోటీల్లో లాస్య 6-1తో అవంతికా రెడ్డిపై, సంజన 6-3తో ఇష్కపై గెలిచారు. అండర్-12లో సంకీర్తి 6-1తో సుమనను ఓడించింది. బాలుర అండర్-12 తొలి రౌండ్‌లో అన్నె ఆకాష్ 6-4తో సాయిరాజ్‌పై నెగ్గాడు.
బాలికల అండర్-14 ఫలితాలు: సాయి హర్షిత 6-0తో ఇష్కా అగర్వాల్‌పై; సృజన 6-3తో సావేరి రెడ్డిపై; తనూజ 6-0తో సుమనపై; సంకీర్తి 6-1తో గ్రీష్మసాయిపై గెలిచారు.
బాలికల అండర్-12: భుమి శేఖర్ 6-5, 7-4తో యశ్వానిపై; సాయి హర్షిత 6-4తో అవంతికా రెడ్డిపై; స్టీషా బుడ్డల 6-5, 7-5తో ఇష్కా అగర్వాల్‌పై; సంజన 6-1తో వింధ్యపై; ప్రాంచీ పండా 6-3తో సృజనపై; వేద వర్షిత 6-2తో నేహాపై నెగ్గారు.
బాలికల అండర్-10: భుమి శేఖర్ 6-1తో వర్ధిని రెడ్డిపై; అభయ 6-1తో మహిమపై; స్టీషా 6-3తో ప్రాంజలపై గెలుపొందారు.
బాలుర అండర్-14: భాస్కర్ మోహన్ రాయ్ 6-5, 7-5తో అర్చిత్‌పై; శశి ప్రీతమ్ 6-0తో జయవంత్‌పై; శశాంక్ 6-1తో హరి హస్వంతపై గెలిచారు.
రెండో రౌండ్‌లో లాస్య
Published Sun, Mar 2 2014 11:46 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement