వేగంగా దూసుకొచ్చిన వ్యాను నడిచి వెళుతున్న వ్యక్తిని ఢీకొన్న ఘటన బుధవారం విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగింది. వివరాలు.. గరుగుబిల్లి మండలం రావుపల్లి గ్రామానికి చెందిన వి.వెంకీ అనే యువకుడు పార్వతీపురంలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. పని ముగించుకుని బుధవారం సాయంత్రం స్వగ్రామానికి బయలుదేరాడు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సిగ్నల్స్ వద్ద... కూరగాయలతో వెళుతున్న వ్యాన్ అతన్ని ఢీకొంది. తీవ్ర గాయాలతో వెంకి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.