
పార్వతీపురం: విజయనగరం జిల్లాలో గుజరాత్ యువతులు హల్‌చల్ చేస్తున్నారు. పార్వతీపురం రోడ్లపై గుంపులుగా తిరుగుతూ స్థానికంగా ఆందోళన రేకెత్తించారు. వారు భాష, యాస కాస్త భిన్నంగా ఉండటంతో ఈ యువతులపై మీడియా ఫోకస్ చేసింది. ప్రధానంగా వీరిపై వాహనదారులు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. వాహనదారులను ఆపి డబ్బులు డిమాండ్ చేయడమే యువతులపై ఫిర్యాదుకు కారణం.
కాగా, తాము గుజరాత్‌లో ఉపాధి కోల్పోయిన కారణంగా ఇలా వచ్చామని సదరు యువతులు పోలీసులకు చెప్పుకొచ్చారు. ఉపాధిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చామని వివరణ ఇచ్చే యత్నం చేశారు. వీరు ఒక లాడ్జిలో మకాం వేసే ఇలా రోడ్లపై తిరుగుతున్నారనే విషయం పోలీసుల విచారణలో వెల్లడైంది. మొత్తం 24 మంది మహిళలను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు.. వీరిని తిరిగి అహ్మదాబాద్‌కు పంపించే యత్నం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment