ఉపాధ్యాయుని అవతారం ఎత్తిన ఎమ్మెల్యే  | MLA Alajangi Jogarao Act As School Teacher On Wednesday In Parvathipuram | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుని అవతారం ఎత్తిన ఎమ్మెల్యే

Published Thu, Feb 13 2020 10:39 AM | Last Updated on Thu, Feb 13 2020 10:47 AM

MLA Alajangi Jogarao Act As School Teacher On Wednesday In Parvathipuram - Sakshi

సాక్షి, పార్వతీపురం : పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు బుధవారం ఉపాధ్యాయుని అవతారం ఎత్తారు. బందలుప్పి జెడ్పీ ఉన్నత పాఠశాలను  బుధవారం సందర్శించి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు. హిందీ, గణితం, సైన్సు సబ్జెక్టులపై విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం పలు ప్రశ్నలు వేసి వాటిని సోదాహరణంగా వివరించారు. ప్రొఫెసర్‌గా పనిచేసిన అనుభవంతో అకట్టుకునేలా బోధన సాగించారు. కాలాన్ని వృథా చేయకుండా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. పదోతరగతిలో పదికి పది మార్కుల సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement