
సిక్స్ టు సిక్స్ ఏం జరిగింది?
వెంకీ, లక్ష్మి జంటగా చల్లా జనార్దనరావు దర్శకత్వం వహించిన చిత్రం ‘వాట్ హ్యాపెన్ 6 టు 6’. వచ్చే నెల 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించడంతో పాటు కథ నచ్చడంతో నేనే నిర్మించాను. నటనకు అవకాశం ఉన్న పాత్ర చేశాను. ఇది లవ్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. కథానుసారం అండమాన్ దీవుల్లో చిత్రీకరించాం. ఎలెందర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.