ఆరు నుంచి ఆరు వరకు ఏం జరిగింది?
ఆరు నుంచి ఆరు వరకు ఏం జరిగింది?
Published Thu, Mar 6 2014 10:56 PM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM
‘చిన్న సినిమా అని చిన్న చూపు చూస్తున్నారు. సినిమా నిర్మాణానికే ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. విడుదల చేయడానికి ఇంకా కష్టపడాల్సి వస్తోంది. మంచి కథాంశంతో తీసిన సినిమా. నన్ను హీరోయిన్‌గా చూడాలని మా అంకుల్ గోయల్ కల. నాతో ఓ సినిమా నిర్మించాలనుకుని, రేపు ప్రారంభం అనగా చనిపోయారు. ఆయన కల నెరవేరాలనే ఆకాంక్షతో నేను హీరోయిన్‌గా నటించి, నిర్మించా’’ అన్నారు లక్ష్మి. వెంకీ, లక్ష్మీ జంటగా జనార్ధనరావు చల్లా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వాట్ హ్యాపెన్ 6 టు 6’. ఎలెందర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను తమ్మారెడ్డి భరద్వాజ్ ఆవిష్కరించి, మనోజ్ నందంకి ఇచ్చారు. ఈ వేడుకలో కేవీవీ సత్యనారాయణ, ప్రసన్నకుమార్, రామసత్యనారాయణ తదితర సినీ ప్రముఖులతో పాటు రాజకీయవేత్తలు రామ్మోహన్ గౌడ్, సింగయ్యపల్లి గోపి, ఇందిరా రెడ్డి తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. అండమాన్-నికోబార్‌లో పలు ప్రతికూల పరిస్థితుల్లో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ సినిమా తీశామని వెంకీ అన్నారు.
Advertisement