What Happen 6 TO 6
-
సిక్స్ టు సిక్స్ ఏం జరిగింది?
వెంకీ, లక్ష్మి జంటగా చల్లా జనార్దనరావు దర్శకత్వం వహించిన చిత్రం ‘వాట్ హ్యాపెన్ 6 టు 6’. వచ్చే నెల 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రంలో హీరోయిన్గా నటించడంతో పాటు కథ నచ్చడంతో నేనే నిర్మించాను. నటనకు అవకాశం ఉన్న పాత్ర చేశాను. ఇది లవ్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. కథానుసారం అండమాన్ దీవుల్లో చిత్రీకరించాం. ఎలెందర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. -
వాట్ హ్యాపెన్ 6 టు 6 మూవీ స్టిల్స్
-
ఆరు నుంచి ఆరు వరకు ఏం జరిగింది?
‘చిన్న సినిమా అని చిన్న చూపు చూస్తున్నారు. సినిమా నిర్మాణానికే ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. విడుదల చేయడానికి ఇంకా కష్టపడాల్సి వస్తోంది. మంచి కథాంశంతో తీసిన సినిమా. నన్ను హీరోయిన్గా చూడాలని మా అంకుల్ గోయల్ కల. నాతో ఓ సినిమా నిర్మించాలనుకుని, రేపు ప్రారంభం అనగా చనిపోయారు. ఆయన కల నెరవేరాలనే ఆకాంక్షతో నేను హీరోయిన్గా నటించి, నిర్మించా’’ అన్నారు లక్ష్మి. వెంకీ, లక్ష్మీ జంటగా జనార్ధనరావు చల్లా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వాట్ హ్యాపెన్ 6 టు 6’. ఎలెందర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను తమ్మారెడ్డి భరద్వాజ్ ఆవిష్కరించి, మనోజ్ నందంకి ఇచ్చారు. ఈ వేడుకలో కేవీవీ సత్యనారాయణ, ప్రసన్నకుమార్, రామసత్యనారాయణ తదితర సినీ ప్రముఖులతో పాటు రాజకీయవేత్తలు రామ్మోహన్ గౌడ్, సింగయ్యపల్లి గోపి, ఇందిరా రెడ్డి తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. అండమాన్-నికోబార్‌లో పలు ప్రతికూల పరిస్థితుల్లో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ సినిమా తీశామని వెంకీ అన్నారు. -
ఆరు నుంచి ఆరు వరకు ఏం జరిగింది?
‘వాట్ హ్యాపెన్? 6 టు 6’ పేరుతో జనార్దన్ చల్లా (జగన్)ని దర్శకుడిగా పరిచయం చేస్తూ లక్ష్మీ ఓ చిత్రం నిర్మిస్తున్నారు. వెంకీ, లక్ష్మీ, కృష్ణతేజ్, మన్మిన్ నాయకా నాయికలు. ఇటీవలే షూటింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రం షూటింగ్ మొత్తం అండమాన్‌లో చేశాం. అండమాన్‌లో మొత్తం షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు సినిమా మాదే కావడం ఆనందంగా ఉంది. సరికొత్త కథాంశంతో రూపొందించిన లవ్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ ఇది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ప్రస్తుతం ముంబయ్‌లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాం. ఓ మంచి సినిమా ఇవ్వడానికి కృషి చేశాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రావణ్ కె.శర్మ, సంగీతం: ఏలేందర్ పైగల్లా.