ఆరు నుంచి ఆరు వరకు ఏం జరిగింది?
ఆరు నుంచి ఆరు వరకు ఏం జరిగింది?
Published Mon, Aug 26 2013 12:54 AM | Last Updated on Fri, Sep 1 2017 10:07 PM
‘వాట్ హ్యాపెన్? 6 టు 6’ పేరుతో జనార్దన్ చల్లా (జగన్)ని దర్శకుడిగా పరిచయం చేస్తూ లక్ష్మీ ఓ చిత్రం నిర్మిస్తున్నారు. వెంకీ, లక్ష్మీ, కృష్ణతేజ్, మన్‌మిన్ నాయకా నాయికలు. ఇటీవలే షూటింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రం షూటింగ్ మొత్తం అండమాన్‌లో చేశాం.
అండమాన్‌లో మొత్తం షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు సినిమా మాదే కావడం ఆనందంగా ఉంది. సరికొత్త కథాంశంతో రూపొందించిన లవ్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ ఇది’’ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ప్రస్తుతం ముంబయ్‌లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాం. ఓ మంచి సినిమా ఇవ్వడానికి కృషి చేశాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రావణ్ కె.శర్మ, సంగీతం: ఏలేందర్ పైగల్లా.
Advertisement
Advertisement