krishna tej
-
నిర్మాతలు నష్టపోకూడదని...
‘హుషారు‘ ఫేమ్ కురపాటి గని కృష్ణతేజ్, అఖిల ఆకర్షణ, తనికెళ్ల భరణి, కల్పనా రెడ్డి ముఖ్య పాత్రల్లో వెంకట్ వందెల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందింది. ముల్లేటి నాగేశ్వరరావు నిర్మాణ సారధ్యంలో రాజధాని ఆర్ట్ మూవీస్ సమర్పణలో జి.వి.ఆర్. ఫిల్మ్ మేకర్స్ పతాకంపై ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా వెంకట్ వందెల మాట్లాడుతూ– ‘‘నిర్మాతలు నష్టపోకూడదని కరోనా సమయంలోనూ ముందుకు వచ్చి షూటింగ్లో పాల్గొన్న తనికెళ్ల భరణిగారికి కృతజ్ఞతలు. మా చిత్రాన్ని అనుకున్న బడ్జెట్లో, అనుకున్న టైమ్‌కి పూర్తి చేశాం’’ అన్నారు. ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. కరోనా కంటే ముందే రెండు షెడ్యూల్స్ పూర్తి చేశాం. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాం’’ అన్నారు ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావు. గణేశ్ మాస్టర్, జీవా, జోగి బ్రదర్స్, అనంత్, బస్ స్టాప్ కోటేశ్వరరావ్, డాక్టర్ ప్రసాద్, మాధవి ప్రసాద్, సునీత మనోహర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: పి. వంశీ ప్రకాశ్, సంగీతం: సందీప్ కుమార్. -
ఈజీ మనీ కోసం...
‘‘పైసా పరమాత్మ’ టైటిల్, పోస్టర్ చాలా బాగున్నాయి. కథను దర్శకుడు విజయ్ నాకు చెప్పారు. చాలా కొత్తగా ఉందనిపించింది. ప్రతిభ ఉన్నవారు కొత్త కాన్సెప్ట్‌లతో ముందుకు రావాలి. కొత్త కంటెంట్‌తో డిఫరెంట్‌గా తీస్తే ఆడియన్స్ ఆదరిస్తున్నారు. ఆ విషయం ‘గూఢచారి’ చిత్రంతో మరోసారి రుజువైంది’’ అని నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు. సంకేత్, సుధీర్, కృష్ణతేజ, రమణ, అనూష, ఆరోహి నాయుడు, బనీష ప్రధాన పాత్రల్లో విజయ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పైసా పరమాత్మ’. లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్ పతాకంపై విజయ్ జగత్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ని రాజ్ కందుకూరి విడుదల చే శారు. విజయ్ కిరణ్ మాట్లాడుతూ –‘‘ఈజీ మనీ కోసం దొంగతనాలు, మోసాలు చేస్తోన్న ఓ నలుగురు కుర్రాళ్లు, ఇద్దరు యువతులు అనుకోకుండా ఓ సమస్యలో ఇరుక్కుంటారు. ఆ సమస్య నుంచి వారు బయట పడ్డారా? లేదా? అన్నది ముఖ్య కథాంశం’’ అన్నారు. -
ఆరు నుంచి ఆరు వరకు ఏం జరిగింది?
‘వాట్ హ్యాపెన్? 6 టు 6’ పేరుతో జనార్దన్ చల్లా (జగన్)ని దర్శకుడిగా పరిచయం చేస్తూ లక్ష్మీ ఓ చిత్రం నిర్మిస్తున్నారు. వెంకీ, లక్ష్మీ, కృష్ణతేజ్, మన్మిన్ నాయకా నాయికలు. ఇటీవలే షూటింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రం షూటింగ్ మొత్తం అండమాన్‌లో చేశాం. అండమాన్‌లో మొత్తం షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు సినిమా మాదే కావడం ఆనందంగా ఉంది. సరికొత్త కథాంశంతో రూపొందించిన లవ్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ ఇది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ప్రస్తుతం ముంబయ్‌లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాం. ఓ మంచి సినిమా ఇవ్వడానికి కృషి చేశాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రావణ్ కె.శర్మ, సంగీతం: ఏలేందర్ పైగల్లా.