‘హుషారు‘ ఫేమ్ కురపాటి గని కృష్ణతేజ్, అఖిల ఆకర్షణ, తనికెళ్ల భరణి, కల్పనా రెడ్డి ముఖ్య పాత్రల్లో వెంకట్ వందెల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందింది. ముల్లేటి నాగేశ్వరరావు నిర్మాణ సారధ్యంలో రాజధాని ఆర్ట్ మూవీస్ సమర్పణలో జి.వి.ఆర్. ఫిల్మ్ మేకర్స్ పతాకంపై ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా వెంకట్ వందెల మాట్లాడుతూ– ‘‘నిర్మాతలు నష్టపోకూడదని కరోనా సమయంలోనూ ముందుకు వచ్చి షూటింగ్‌లో పాల్గొన్న తనికెళ్ల భరణిగారికి కృతజ్ఞతలు. మా చిత్రాన్ని అనుకున్న బడ్జెట్‌లో, అనుకున్న టైమ్‌కి పూర్తి చేశాం’’ అన్నారు. ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. కరోనా కంటే ముందే రెండు షెడ్యూల్స్ పూర్తి చేశాం. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాం’’ అన్నారు ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావు. గణేశ్ మాస్టర్, జీవా, జోగి బ్రదర్స్, అనంత్, బస్ స్టాప్ కోటేశ్వరరావ్, డాక్టర్ ప్రసాద్, మాధవి ప్రసాద్, సునీత మనోహర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: పి. వంశీ ప్రకాశ్, సంగీతం: సందీప్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment