వెయిట్‌ గురూ! | NTR to work from 15th March | Sakshi
Sakshi News home page

వెయిట్‌ గురూ!

Published Fri, Mar 10 2017 11:54 PM | Last Updated on Wed, Aug 29 2018 2:33 PM

వెయిట్‌ గురూ! - Sakshi

వెయిట్‌ గురూ!

ఎన్టీఆర్‌ హీరోగా నటించనున్న 27వ సినిమా షూటింగ్‌ ఎప్పుడో మొదలైంది. కానీ, ఎన్టీఆర్‌ ఇంకా సెట్‌లో అడుగుపెట్టలేదు. కారణం ఏంటో తెలుసుకోవా లని చాలామందికి ఉంది. ఈ నెల 15 నుంచి ఎన్టీఆర్‌ షూటింగ్‌లో పాల్గొంటారనే సమాధానం వినిపించింది తప్ప.. లేటుగా సెట్‌లోకి ఎందుకు ఎంట్రీ ఇస్తున్నారనే విషయం మాత్రం బయటకు రాలేదు. అసలు మేటర్‌ ఏంటంటే... ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ సుమారు 15 కిలోల బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నారట.

ఇందులో ఎన్టీఆర్‌ మూడు పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. మూడు పాత్రల మధ్య వ్యత్యాసం చూపిస్తూ, స్లిమ్‌ అండ్‌ స్టైలిష్ గా కనిపించాలనుకుంటున్నారట! దర్శకుడు కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) అడగడంతో ఇప్పటికే ఎన్టీఆర్‌ 10 కిలోలు తగ్గినట్టు సమాచారం. వెయిట్‌ తగ్గిన తర్వాత ఎన్టీఆర్‌ లుక్‌ ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే గురూ! ఈ నెల 15న హైదరాబాద్‌లో మొదలు కానున్న కొత్త షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌ పాల్గొననున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా ఓ హీరోయిన్‌. మరో ఇద్దర్ని ఎంపిక చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement