ఆనందం.. పరమానందం!
రాశీ ఖన్నా మాతృభాష తెలుగు కాదు.. హిందీ. అయినా తెలుగు చక్కగా మాట్లాడగలుగుతారు. మాట్లాడటం ఏంటి? పాట కూడా పాడేశారు. ‘జోరు’ సినిమా కోసం ఆమె టైటిల్ ట్రాక్ పాడిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు తన భాష కాని మరో భాషలో కూడా ఈ బ్యూటీ పాట పాడారు. అది మలయాళ సినిమా ‘విలన్’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా లేడీ విలన్‌గా నటిస్తున్నారట. అదో ప్రత్యేకత అయితే ఈ సినిమా కోసం పాట పాడటం మరో ప్రత్యేకత. ‘విలన్’ టైటిల్ ట్రాక్‌ను రాశి పాడారు. యాక్చువల్‌గా చిన్నప్పటి నుంచి తనకు పెద్ద సింగర్ కావాలనే ఆశ ఉంది. ఆమెతో పాటు పాట పాడాలనే ఆకాంక్ష కూడా పెరుగుతూ వచ్చింది.
స్కూల్‌లో సింగింగ్ పోటీల్లో టాలెంట్‌ని కూడా ప్రదర్శించుకున్నారు. ఒకవేళ హీరోయిన్ కాకపోయి ఉంటే సింగర్‌గా సెటిలయ్యేవారు. ఆ అవకాశం లేదు కాబట్టి, హీరోయిన్‌గా చేస్తూనే ఛాన్స్ వస్తే... పాటలు కూడా పాడాలనుకుంటున్నారు. అందుకే ‘జోరు’కి అవకాశం వచ్చినప్పుడు ఆనందపడిపోయారు. ఇప్పుడు రెండో పాటకు కూడా అవకాశం రావడంతో పరమానందపడిపోతున్నారు.