రైతన్నకు దన్నుగా.. మేమంతా ఉండగా...
అన్నదాతలకు మద్దతు దేశవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. బీజేపీ మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు రైతులకు అండగా నిలబడటంతో బంద్ సంపూర్ణంగా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ బంద్ పాటిస్తున్నారు. పూర్తి వివరాలు..
ఏలూరుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుబట్టని వ్యాధికి కారణాలను అన్వేషించేందుకు అత్యున్నత స్థాయి వైద్య నిపుణుల బృందాలు నేడు రానున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు, ఐఐసీటీ బృందం ఏలూరులో పర్యటించనున్నాయి. పూర్తి వివరాలు
తెలంగాణ పత్తికి బ్రాండ్ ఇమేజ్
తెలంగాణలో పండే పత్తికి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. తమ రాష్ట్రంలో పండే పత్తి దేశంలో కెల్లా అత్యంత నాణ్యమైనదిగా గుర్తింపు పొందిందని, ప్రపంచంలోకెల్లా అత్యంత నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో తెలంగాణ ఒకటని ఆయన తెలిపారు. పూర్తి వివరాలు
సోషల్ మీడియాపై అణచివేతలొద్దు
సోషల్ మీడియాను అణచివేయాలనుకోవడం సరైంది కాదని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ చెప్పారు. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి అది ఎంతమాత్రం మంచిది కాదని పేర్కొన్నారు. పూర్తి వివరాలు
పెరగనున్న టీవీల ధరలు
టీవీ, వాషింగ్ మెషీన్, ఫ్రిజ్, ఏసీ, మైక్రోవేవ్ ఓవెన్ తదితర వైట్ గూడ్స్ ధరలు త్వరలోనే పెరగనున్నాయి. ఉత్పత్తి, రవాణా వ్యయాలు పెరుగుతుండటంతో ఈ వస్తువుల ధరలను కంపెనీలు పెంచక తప్పడం లేదు. పూర్తి వివరాలు
ఆరోహణ రేఖ
రేఖారావుది హైదరాబాద్, కూకట్‌పల్లి. ఆమె ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రిపాల్ దగ్గర పర్వతారోహణం నేర్చుకున్నారు. పెళ్లి చేసుకుని, ఒక బిడ్డకు తల్లయిన తర్వాత కూడా హిమాలయ పర్వతాల ఆరోహణ చేశారు! పూర్తి వివరాలు
క్లీన్‌స్వీప్‌పై టీమిండియా గురి
భారత్–ఆస్ట్రేలియా చివరి టి20 నేడు జరగనుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ క్లీన్‌స్వీప్‌పై గురిపెట్టింది. పూర్తి వివరాలు
మాట్రిమోనియల్ ఫ్రాడ్
విదేశీ వధువుగా రిజిస్టర్ చేసుకున్న ఓ మహిళ వల్లో పడిన హైదరాబాద్ నగర వాసి రూ.5 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు సోమవారం సిటీ సైబర్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. పూర్తి వివరాలు
వైరల్: భయపెట్టిన దెయ్యం
ఓ వ్యక్తి తన గదిలో తన పని చేసుకుంటుంటే అకస్మాత్తుగా శబ్ధాలు వినిపించాయి. ఆ సమయంలో అతడు తప్ప అక్కడ మరెవరూ లేరు. దీంతో ఇది ప్రాంక్ కాదని అతడికి అర్థమైంది. పూర్తి వివరాలు
అమెరికా హెల్త్ సెక్రటరీగా హావియర్
అమెరికా ఆరోగ్య శాఖ (సెక్రెటరీ ఆఫ్ హెల్త్), హ్యూమన్ సర్వీసెస్ మంత్రిగా హావియర్ బసెరా ఎంపికయ్యారు. అలాగే, భారతీయ అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తిని సర్జన్ జనరల్‌గా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ ఎంపిక చేసుకున్నారు. పూర్తి వివరాలు
రాజకీయాల్లోకి వస్తాను: హీరోయిన్
‘భవిష్యత్తులో పక్కాగా రాజకీయాల్లోకి వెళ్తాను. అంతకంటే ముందు ఓ ఎన్జీవో ప్రారంభిస్తాను. నాకు రాజకీయాలు ఎలా చేయాలో తెలియదు. కానీ సహాయం ఎలా చేయాలో తెలుసు’ అంటున్న రాశీ ఖన్నా. పూర్తి వివరాలు
Comments
Please login to add a commentAdd a comment