Nandamuri Balakrishna Unstoppable Episode 6 Promo Out Now - Sakshi
Sakshi News home page

Unstoppable Promo: మేమిద్దరం హాట్‌ పెయిర్.. ముగ్గురు భామలతో బాలయ్య సందడి

Published Thu, Dec 22 2022 7:14 PM | Last Updated on Thu, Dec 22 2022 8:30 PM

Nandamuri Balakrishna Unstoppable Episode 6 Promo Out Now  - Sakshi

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్‌ రెండో సీజన్ టాలీవుడ్ సెలబ్రిటీలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సీజన్‌లో రెబల్‌ స్టార్ ప్రభాస్, గోపీచంద్‌ కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. తాజాగా ఈ సీజన్‌లో మరో ముగ్గురు హీరోయిన్లను తీసుకొచ్చారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో పాటు మరో కథానాయిక రాశీ ఖన్నా పాల్గొననుంది. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది. వీరితో కలిసి బాలయ్య సందడి చేయగా సోషల్ మీడియాలో వైరలవుతోంది. డిసెంబర్ 23న ఫుల్ ఎపిసోడ్ ప్రసారమవుతుంది. 

ఈ ఎపిసోడ్‌లో బాలయ్య ముగ్గురు భామలతో కలిసి డ్యాన్స్ చేస్తూ సందడి వేశారు. రాశి ఖన్నాని పొగుడుతూ అలరించాడు.  రాశి ఖన్నా తాను నటించిన ఊహలు గుసగుసలాడే సినిమాలోని పాటతో అలరించింది. ఈ ప్రోమోలో  జయప్రద, జయసుధపై ప్రశ్నల వర్షం కురిపించారు బాలయ్య. ప్రస్తుతం నేను, శృతి  ఆంధ్రప్రదేశ్‌లో హాట్‌ పెయిర్‌ అంటూ క్రేజీ కామెంట్స్ చేశారు.  వచ్చే ఏడాదికి సంక్రాంతికి వీరసింహ రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement