joru
-
ఆనందం.. పరమానందం!
రాశీ ఖన్నా మాతృభాష తెలుగు కాదు.. హిందీ. అయినా తెలుగు చక్కగా మాట్లాడగలుగుతారు. మాట్లాడటం ఏంటి? పాట కూడా పాడేశారు. ‘జోరు’ సినిమా కోసం ఆమె టైటిల్ ట్రాక్ పాడిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు తన భాష కాని మరో భాషలో కూడా ఈ బ్యూటీ పాట పాడారు. అది మలయాళ సినిమా ‘విలన్’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా లేడీ విలన్‌గా నటిస్తున్నారట. అదో ప్రత్యేకత అయితే ఈ సినిమా కోసం పాట పాడటం మరో ప్రత్యేకత. ‘విలన్’ టైటిల్ ట్రాక్‌ను రాశి పాడారు. యాక్చువల్‌గా చిన్నప్పటి నుంచి తనకు పెద్ద సింగర్ కావాలనే ఆశ ఉంది. ఆమెతో పాటు పాట పాడాలనే ఆకాంక్ష కూడా పెరుగుతూ వచ్చింది. స్కూల్లో సింగింగ్ పోటీల్లో టాలెంట్‌ని కూడా ప్రదర్శించుకున్నారు. ఒకవేళ హీరోయిన్ కాకపోయి ఉంటే సింగర్‌గా సెటిలయ్యేవారు. ఆ అవకాశం లేదు కాబట్టి, హీరోయిన్గా చేస్తూనే ఛాన్స్ వస్తే... పాటలు కూడా పాడాలనుకుంటున్నారు. అందుకే ‘జోరు’కి అవకాశం వచ్చినప్పుడు ఆనందపడిపోయారు. ఇప్పుడు రెండో పాటకు కూడా అవకాశం రావడంతో పరమానందపడిపోతున్నారు. -
జోరు 5thDecember 2015
-
అక్షరాలా ఆరు కిలోలు కట్!
చక్కనమ్మ చిక్కినా అందమే అనేది పాత నానుడే అయినా... అమ్మాయిల బరువు గురించి చెప్పేటప్పుడు ఇలా అనక తప్పదు. వెండితెరపై ఇప్పటివరకూ వచ్చిన కథానాయికల్లో ముందు బొద్దుగా ఉండి, ఆ తర్వాత సన్నబడ్డ తారల్లో ఇప్పుడు రాశీ ఖన్నా చేరారు. ‘ఊహలు గుసగుసలాడె’, ‘జోరు’, ‘జిల్’ చిత్రాల్లో బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ రాబోయే ‘బెంగాల్ టైగర్’, ‘శివమ్’లో సన్నగా కనిపించనున్నారు. ఎందుకంటే, ఆరు కిలోలు బరువు తగ్గారామె. రాశీ సహజ సిద్ధంగానే సన్నబడ్డారు. ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీలోని హరిద్వార్‌లో గల ఓ స్పాకి వెళ్లారామె. ఆ స్పాలో ఉన్నన్నాళ్లూ యోగా, ధ్యానం, వాకింగ్, వారంలో రెండు రోజులు జిమ్ చేశారు. వీటివల్ల తాను అనుకున్నట్లు సన్నబడగలిగారు. ఇప్పుడు తన శరీరానికి ఎలాంటి వ్యాయామాలు కరెక్ట్ అనే విషయంపై రాశీఖన్నాకి ఓ అవగాహన వచ్చేసిందట. అందుకని తగ్గిన ఈ ఆరు కిలోలు పెరగకుండా ఎప్పుడూ స్లిమ్‌గా మెయిన్టైన్ అయిపోతానని అంటున్నారు. -
‘జోరు’మూవీ ప్లాటినం డిస్క్ ఫంక్షన్
-
జోరు టీమ్‌తో చిట్ ఛాట్
-
విడుదలకు సిద్ధమైన 'జోరు'
-
రాశిఖన్నా 'జోరు' స్టిల్స్
-
వచ్చే ఏడాది హిందీ సినిమా చేస్తా!
ప్రస్థానం, స్నేహగీతం, రొటీన్ లవ్‌స్టోరీ, గుండెల్లో గోదారి, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, రారా కృష్ణయ్య.. ఇలా సినిమా సినిమాకీ నటునిగా పరిణతి సాధించుకుంటూ ముందుకెళ్తున్నారు హీరో సందీప్ కిషన్. ఆయన కథానాయకునిగా ‘గుండెల్లో గోదారి’ ఫేం కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో రూపొందిన ‘జోరు’ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మీడియాతో ముచ్చటించారు. ‘గుండెల్లో గోదారి’ టైమ్‌లోనే కుమార్ నాగేంద్ర, నేనూ ఓ సినిమా చేయాలనుకున్నాం. ఎలాంటి సినిమా చేయాలనే విషయంపై ఎన్నో రకాలుగా ఆలోచించాం. పూర్తి స్థాయి కామెడీ సినిమా చేద్దామని చివరకు నాగేంద్రే అన్నాడు. నాక్కూడా ఆ ఆలోచన నచ్చింది. ప్రయోగాల జోలికి వెళ్లకుండా, ప్రేక్షకుల్ని నవ్వించడమే పరమావధిగా ఈ సినిమా చేశాం. కామెడీ కథల పరంగా ఇప్పటి వరకూ రాని కథాంశంతో ఈ సినిమా చేశాం. చెబితే వింతగా అనిపిస్తుంది కానీ... ఈ సినిమాలో రాశి ఖన్నా, సుష్మ, ప్రియా బెనర్జీ కథానాయికలు. ఈ ముగ్గురూ ఒకే పాత్ర పోషించడం విశేషం. ఆ పాత్ర పేరు అన్నపూర్ణ. చెబితే వింతగా అనిపిస్తుంది కానీ, చూస్తేనే మజా ఉంటుంది. అలాగే... ఇందులో నాకు ఇద్దరు అమ్మానాన్నలుంటారు. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ చిత్రాల శైలిలో కన్ఫ్యూజన్తో కూడిన కామెడీ ఉంటుంది. బ్రహ్మానందం, సప్తగిరి పాత్రలు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలు. అక్కడ మంచి పేరు తెచ్చింది ‘షోర్ ఇన్ ది సిటీ’ చిత్రం బాలీవుడ్లో నాకు మంచి పేరు తెచ్చింది. అయితే... తెలుగులో బిజీగా ఉండటం వల్ల మళ్లీ బాలీవుడ్లో సినిమా చేయలేకపోయాను. వచ్చే ఏడాది ఓ హిందీ సినిమా చేస్తా. ఇక ఇక్కడి విషయానికొస్తే - కన్మణి దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవీస్, ఆనంది ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాను. అలాగే ఎ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వి.ఆనంద్ దర్శకత్వంలో ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ కలిసి నిర్మిస్తున్న చిత్రం చేస్తున్నా. మరో తమిళ సినిమా కూడా ‘ఓకే’ చేశా. -
కొత్త కాన్సెప్ట్‌తో కామెడీ
‘గుండెల్లో గోదారి’తో ప్రశంసలందుకున్న దర్శకుడు కుమార్ నాగేంద్ర రెండో ప్రయత్నం ‘జోరు’. సందీప్‌కిషన్, ‘ఊహలు గుసగుసలాడే’ ఫేమ్ రాశీ ఖన్నా, సుష్మా, ప్రియా బెనర్జీ ముఖ్యతారలు. ఈ నెల 7న రిలీజ్ కానున్న చిత్రం గురించి, దర్శకుడు ‘సాక్షి’తో మాట్లాడుతూ, ‘‘నా తొలి చిత్రానికి భిన్నంగా పూర్తి వినోదాత్మకంగా సాగే సినిమా ఇది. నేటి యువతరం కోరుకొనే రీతిలో ప్రతి సన్నివేశం ‘జోరు’గా సాగుతుంది. ఒకే పాత్రను ముగ్గురు పోషించడమనే వినూత్న కాన్సెప్ట్ అనుసరించాం. పాత్రల మధ్య గందరగోళంతో ప్రేక్షకు లకు బోలెడంత వినోదం వస్తుంది’’ అని వివరించారు. కథా పరంగా ముగ్గురు నాయికలకూ ప్రాధాన్యమున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు అశోక్, నాగార్జున మాట్లాడుతూ,‘‘సినిమా చకచకా సాగుతుంది. బ్రహ్మానందం, సప్తగిరి, పృథ్వీరాజ్ కామెడీ మరో హైలైట్’’ అని పేర్కొన్నారు. -
సుష్మారాజ్ 'జోరు' స్టిల్స్
-
జోరు మూవీ న్యూ స్టిల్స్
-
‘మనసా చెప్పవే...’ నచ్చింది : సందీప్ కిషన్
‘‘ప్రచార చిత్రాలు చూసి, ఇది యాక్షన్ మూవీ అనుకుంటారేమో. కానీ, ఇందులో యాక్షన్‌తో పాటు ప్రేమ, వినోదం, సెంటిమెంట్ అన్నీ ఉంటాయి. అన్ని వర్గాలవారికి నచ్చే విధంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భీమ్స్ స్వరపరచిన పాటలు ఓ హైలైట్. ఈ పాటల్లో ‘మనసా చెప్పవే..’ నాకు బాగా నచ్చింది’’ అని సందీప్ కిషన్ చెప్పారు. కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో సందీప్ కిషన్, రాశీ ఖన్నా జంటగా అశోక్, నాగార్జున నిర్మించిన చిత్రం ‘జోరు’. ఈ చిత్రం పాటలు ఆదరణ పొందిన నేపథ్యంలో శనివారం పాటల విజయోత్సవం జరిపారు. ఈ సందర్భంగా భీమ్స్ మాట్లాడుతూ -‘‘కుమార్ నాగేంద్ర చక్కని అభిరుచి గల దర్శకుడు. నా నుంచి మంచి స్వరాలు రాబట్టుకున్నారు. ఈ పాటలు విజయం సాధించినట్లుగానే చిత్రం కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ఇందులో తనది బబ్లీ కేరెక్టర్ అని, ఓ పాట కూడా పాడానని రాశీ ఖన్నా తెలిపారు. ఈ చిత్రంలో ఓ పాట పాడానని, మరో సంగీతదర్శకుడి స్వరాలకు నా స్వరం ఇవ్వడం ఆనందంగా ఉందని సంగీతదర్శకుడు సునిల్ కశ్యప్ అన్నారు. ఈ చిత్రం విడుదల తర్వాత మళ్లీ ఇదే టీమ్‌తో మరో సినిమా చేస్తామని అశోక్ తెలిపారు. -
‘జోరు’ ఆడియో సక్సెస్ మీట్
-
జోరు ఆడియో హైలెట్స్