అక్షరాలా ఆరు కిలోలు కట్! | Yoga Helped Raashi Khanna Shed 6 Kgs | Sakshi
Sakshi News home page

అక్షరాలా ఆరు కిలోలు కట్!

Published Wed, Jun 3 2015 10:48 PM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM

అక్షరాలా ఆరు కిలోలు కట్!

అక్షరాలా ఆరు కిలోలు కట్!

 చక్కనమ్మ చిక్కినా అందమే అనేది పాత నానుడే అయినా... అమ్మాయిల బరువు గురించి చెప్పేటప్పుడు ఇలా అనక తప్పదు. వెండితెరపై ఇప్పటివరకూ వచ్చిన కథానాయికల్లో ముందు బొద్దుగా ఉండి, ఆ తర్వాత సన్నబడ్డ తారల్లో ఇప్పుడు రాశీ ఖన్నా చేరారు. ‘ఊహలు గుసగుసలాడె’, ‘జోరు’, ‘జిల్’ చిత్రాల్లో బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ రాబోయే ‘బెంగాల్ టైగర్’, ‘శివమ్’లో సన్నగా కనిపించనున్నారు. ఎందుకంటే, ఆరు కిలోలు బరువు తగ్గారామె.
 
 రాశీ సహజ సిద్ధంగానే సన్నబడ్డారు. ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీలోని హరిద్వార్‌లో గల ఓ స్పాకి వెళ్లారామె. ఆ స్పాలో ఉన్నన్నాళ్లూ యోగా, ధ్యానం, వాకింగ్, వారంలో రెండు రోజులు జిమ్ చేశారు. వీటివల్ల తాను అనుకున్నట్లు సన్నబడగలిగారు. ఇప్పుడు తన శరీరానికి ఎలాంటి వ్యాయామాలు కరెక్ట్ అనే విషయంపై రాశీఖన్నాకి ఓ అవగాహన వచ్చేసిందట. అందుకని తగ్గిన ఈ ఆరు కిలోలు పెరగకుండా ఎప్పుడూ స్లిమ్‌గా మెయిన్‌టైన్ అయిపోతానని అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement