‘మనసా చెప్పవే...’ నచ్చింది : సందీప్ కిషన్ | i like to Manasa cheppave song says Sandeep Kishan | Sakshi
Sakshi News home page

‘మనసా చెప్పవే...’ నచ్చింది : సందీప్ కిషన్

Published Sat, Oct 11 2014 11:03 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

‘మనసా చెప్పవే...’ నచ్చింది : సందీప్ కిషన్ - Sakshi

‘మనసా చెప్పవే...’ నచ్చింది : సందీప్ కిషన్

‘‘ప్రచార చిత్రాలు చూసి, ఇది యాక్షన్ మూవీ అనుకుంటారేమో. కానీ, ఇందులో యాక్షన్‌తో పాటు ప్రేమ, వినోదం, సెంటిమెంట్ అన్నీ ఉంటాయి. అన్ని వర్గాలవారికి నచ్చే విధంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భీమ్స్ స్వరపరచిన పాటలు ఓ హైలైట్. ఈ పాటల్లో ‘మనసా చెప్పవే..’ నాకు బాగా నచ్చింది’’ అని సందీప్ కిషన్ చెప్పారు. కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో సందీప్ కిషన్, రాశీ ఖన్నా జంటగా అశోక్, నాగార్జున నిర్మించిన చిత్రం ‘జోరు’. ఈ చిత్రం పాటలు ఆదరణ పొందిన నేపథ్యంలో శనివారం పాటల విజయోత్సవం జరిపారు.
 
 ఈ సందర్భంగా భీమ్స్ మాట్లాడుతూ -‘‘కుమార్ నాగేంద్ర చక్కని అభిరుచి గల దర్శకుడు. నా నుంచి మంచి స్వరాలు రాబట్టుకున్నారు. ఈ పాటలు విజయం సాధించినట్లుగానే చిత్రం కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ఇందులో తనది బబ్లీ కేరెక్టర్ అని, ఓ పాట కూడా పాడానని రాశీ ఖన్నా తెలిపారు. ఈ చిత్రంలో ఓ పాట పాడానని, మరో సంగీతదర్శకుడి స్వరాలకు నా స్వరం ఇవ్వడం ఆనందంగా ఉందని సంగీతదర్శకుడు సునిల్ కశ్యప్ అన్నారు. ఈ చిత్రం విడుదల తర్వాత మళ్లీ ఇదే టీమ్‌తో మరో సినిమా చేస్తామని అశోక్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement