రిలీజ్కు ముందే భారీ బిజినెస్ | superb pre release bussines for raviteja bengal tiger | Sakshi
Sakshi News home page

రిలీజ్కు ముందే భారీ బిజినెస్

Nov 13 2015 5:31 PM | Updated on Sep 3 2017 12:26 PM

రిలీజ్కు ముందే భారీ బిజినెస్

రిలీజ్కు ముందే భారీ బిజినెస్

భారీ అంచనాల మధ్య విడుదలైన 'కిక్ 2' డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటం, రవితేజ కెరీర్ మీద పెద్దగా ఎఫెక్ట్ చూపినట్టుగా లేదు. గతంలో బలుపు, పవర్ సినిమాలతో మంచి సక్సెస్లు సాధించిన...

భారీ అంచనాల మధ్య విడుదలైన 'కిక్ 2' డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటం, రవితేజ కెరీర్ మీద పెద్దగా ఎఫెక్ట్ చూపినట్టుగా లేదు. గతంలో బలుపు, పవర్ సినిమాలతో మంచి సక్సెస్లు సాధించిన మాస్ మహరాజ్, ఆ తరువాత కిక్ 2తో అలరించలేకపోయినా, ప్రస్తుతం చేస్తున్న బెంగాల్ టైగర్ సినిమాకు మంచి బిజినెస్ జరుగుతోంది. ముఖ్యంగా మినిమమ్ గ్యారెంటీ హీరోగా రవితేజకు ఉన్న ఇమేజ్ ఈ సినిమాకు చాలా ప్లస్ అవుతోంది.

సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న బెంగాళ్ టైగర్ సినిమాలో తమన్నా, రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సంపత్ నంది. కిక్ 2 రిజల్ట్తో బెంగాల్ టైగర్ బిజినెస్పై ఎన్నో అనుమానాలు వచ్చాయి. అయితే వాటన్నింటినీ పక్కకు నెట్టి రవితేజ సత్తా చాటుతున్నాడట. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో బిజినెస్ పూర్తయిన ఈ సినిమా, టేబుల్ ప్రాఫిట్ దిశగా సాగుతుందని టాక్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement