శ్రీవారి సేవలో ‘సుప్రీమ్’
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం 'సుప్రీం' చిత్ర బృందం దర్శించుకుంది. హీరో సాయిధరమ్‌తేజ, రాశిఖన్నాతో పాటు నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు అనిల్ రవిపూడి తదితరులు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు. అలాగే, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుష్పా సత్యనారాయణ కూడా వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు.