ఏప్రిల్‌లో ఎండలు ఎలా ఉంటాయి? వడదెబ్బ తగిలేంత స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇండోర్‌లో పని చేసేవాళ్లకు సమస్య ఉండదు కానీ అవుట్‌డోర్‌లో వర్క్ అంటే కష్టమే. సినిమా షూటింగ్స్ అన్నీ దాదాపు అవుట్‌డోర్‌లోనే జరుగుతాయి. అయినా నో ప్రాబ్లమ్ ‘ఎండల్లో హాయ్ హాయ్’ అంటున్న యూనిట్స్‌లో ‘వెంకీమామ’ అండ్ టీమ్ ఒకటి. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర (బాబి) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వెంకీమామ’. ఇందులో వెంకటేశ్ సరసన పాయల్ రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు.
ఇటీవల రాజమండ్రిలో మొదలైన ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. నెక్ట్స్ షెడ్యూల్ ఏప్రిల్‌లో మొదటి వారంలో స్టార్ట్ కానుందని సమాచారం. అంటే ఈ పదిహేను రోజులు ‘వెంకీమామ’ టీమ్ విరామం తీసుకుని, మాంచి ఎండల్లో మరో షెడ్యూల్ మొదలుపెట్టనున్నారన్నమాట. ఇందులో వెంకటేశ్, నాగచైతన్య నిజజీవితంలో మాదిరిగానే మామాఅల్లుళ్లుగా నటిస్తారు. సురేశ్ ప్రొడక్షన్స్, కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment