మళ్లీ వస్తా.. కాజా తింటా | chit chat kajal agarwal | Sakshi
Sakshi News home page

మళ్లీ వస్తా.. కాజా తింటా

Published Sat, Dec 21 2013 2:48 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

మళ్లీ వస్తా..  కాజా తింటా - Sakshi

మళ్లీ వస్తా.. కాజా తింటా

 మీడియాతో కాజల్ చిట్‌చాట్
 కాకినాడ, న్యూస్‌లైన్ : ‘పచ్చని పొలాలు...   ఆహ్లాదం గొలిపే పర్యాటక ప్రాంతాలున్న తూర్పుగోదావరి జిల్లాకు రావడం ఇదే మొదటిసారి. కాకినాడ రావడం ఆనందంగా ఉంది. ఇక్కడి అభిమానులు నాపై చూపుతున్న ఆప్యాయత మరువలేను.’ అని ప్రముఖ సినీనటి కాజల్‌అగర్వాల్ అన్నారు. మెయిన్‌రోడ్డులో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ‘శ్రీనికేతన్ ఉమెన్స్ షాపింగ్ వరల్డ్’ను ప్రారంభించేందుకు వచ్చిన కాజల్ మీడియాతో    కొద్దిసేపు ముచ్చటించారు.  
 
 ప్ర: తూర్పుగోదావరి జిల్లా ఎలా ఉంది?
 జః చాలా బాగుంది. మళ్లీ రావాలనిపిస్తోంది
 
 ప్ర: కాకినాడ కాజా రుచి చూశారా?
 జః రుచి చూడలేదు. త్వరలోనే మళ్లీ వస్తా. ఈసారి తప్పకుండా కాజా తింటా.
 
 ప్రః తెలుగు ఇండస్ట్రీకి దూరమైనట్టున్నారు?
 జ: అబ్బే అదేం లేదు. తెలుగులో నటిస్తూనే ఉంటా. తెలుగు పరిశ్రమకు దూరమయ్యే ప్రసక్తే లేదు.
 
 ప్ర: బాలీవుడ్‌లో అవకాశాలు ఎలా ఉన్నాయి?
 జ : మంచి ఛాన్సులు వస్తున్నాయి. ఉత్తరాది ప్రేక్షకులు కూడా మంచి ఆదరణ చూపుతున్నారు.
 
 ప్రః ప్రస్తుతం ఏ సినిమాల్లోచేస్తున్నారు?
 జః ‘జో’ సినిమా విడుదలకు  సిద్ధంగా ఉంది. సంక్రాంతికి ఇది విడుదలవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో మరో రెండు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి.
 
 ప్ర : నటిగా మీకు బ్రేక్ ఇచ్చిన సినిమా ఏది ?
 జ : ముందు చందమామ.. ఆ తర్వాత మగధీర.. తర్వాత చాలా సినిమాలు ఉన్నాయి.
 
 ప్రః తెలుగులో మళ్లీ ఎప్పుడు కనిపిస్తారు?
 జః  తెలుగులో కూడా మంచి ప్రాజెక్టులు ఉంటాయి. తెలుగు ప్రజల ఆదరాభిమానాల వల్లనే ఇవాళ నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. వారిని మరువలేను.
 
 కాకినాడలో కాజల్ సందడి
 శ్రీ నికేతన్ మహిళా షోరూం ప్రారంభం
 కాకినాడ, న్యూస్‌లైన్ : ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ శుక్రవారం కాకినాడలో సందడి చేశారు. ఆమెను చూసేందుకు వచ్చిన అభిమానులతో మెయిన్ రోడ్ జనసంద్రంగా మారింది. హాయ్ ... అంటూ చేతులూపుతూ ఆమె అభిమానులను పలకరించారు. మెయిన్‌రోడ్డులో మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీనికేతన్ ఉమెన్స్ షాపింగ్ వరల్డ్‌ను ఆమె ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన కాజల్ వివిధ విభాగాలను సందర్శించారు. కళానికేతన్ టెక్స్‌టైల్స్ జ్యూవెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ వి.లీలాకుమార్, ప్రముఖ వ్యాపారవేత్త సత్తి సత్య నారాయణరెడ్డి (దొరబాబు) ఆమెకు స్వాగతం పలికారు. వారు మాట్లాడుతూ కంచి పట్టు, బెనారస్, కలకత్తా, సూరత్ చీరలతో పాటు వెస్ట్రన్, కిడ్స్ వేర్, సంప్రదాయ లంగాఓణీదుస్తులతో సహా  పలు మోడల్స్ ఉంటాయన్నారు.
 
  కలెక్టర్ నీతూప్రసాద్, కాకినాడ సిటీ తాజామాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి  చంద్రశేఖర్ భార్య మహాలక్ష్మి, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు భార్య శ్రీవిద్య, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి భార్య లక్ష్మీరాజ్యంతో పాటు సత్తి మాధవి, బద్దం సుధ, సత్తి లక్ష్మీనాగసుధ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement