మార్పు తెచ్చే సినిమా!
‘‘ఈ చిత్రాన్ని సామాన్య ప్రేక్షకుల వద్దకు తీసుకెళుతున్నాం. ‘నేనుప్రొడ్యూసర్.కామ్’ వెబ్‌సైట్ ద్వారా ఈ చిత్రానికి నిర్మాతలుగా మారే అవకాశం కల్పిస్తున్నాం. నరేశ్‌గారు స్థాపించిన ‘కళాకారుల ఐక్యవేదిక’ ద్వారా మాకు కళాకారుల్ని అందించారు. ఆయన సపోర్ట్ లేకుండా సినిమా త్వరగా పూర్తయ్యేది కాదు. హిందూపురం ప్రజలు ఎంతగానో సహకరించారు. ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీలో చిన్న మార్పు తీసుకొస్తుంది’’ అని దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెలిపారు. సిద్ధు జొన్నలగడ్డ, రష్మి గౌతమ్, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రల్లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఎమ్. రాజ్‌కుమార్ నిర్మించిన చిత్రం ‘గుంటూర్ టాకీస్’.
శ్రీ చరణ్ పాకాల అందించిన ఈ చిత్రం పాటలను సంగీత దర్శకుడు రఘు కుంచె, నిర్మాత ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి విడుదల చేశారు. నిర్మాత రాజ్‌కుమార్ మాట్లాడుతూ - ‘‘టైటిల్ చూసి ఇది గుంటూరుకు చెందిన కథ అనుకోవద్దు. మార్చి 4న రిలీజ్ చేస్తున్నాం. మా చిత్రాన్ని విడుదల చేస్తున్న వారాహి సంస్థ అధినేత సాయి కొర్రపాటికి కృతజ్ఞతలు’’ అన్నారు. నిర్మాతలు యలమంచిలి సాయి బాబు, బెక్కెం వేణుగోపాల్, దర ్శకులు ఎ. కోదండరామిరెడ్డి, సముద్ర, రవికాంత్ పేరెపు, హీరో ‘అల్లరి నరేశ్’, నటి, నిర్మాత లక్ష్మీ మంచు, నాయికలు శ్రద్ధాదాస్, రష్మీ గౌతమ్, నటులు నరే శ్, రాజారవీంద్ర పాల్గొన్నారు.