
మంచి ప్రయత్నమిది!
‘‘తెలుగు పరిశ్రమ ఇక్కడ అభివృద్ధి చెందడానికి అవసరమైన వనరులు అందించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు సిద్ధంగా ఉన్నారు. మంచి చిత్రాలను అందించేవారికి రాయితీలు ఇవ్వాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. ఒక మంచి ఆలోచనతో రాజ్‌కుమార్ తీసిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి’’ అని తెలంగాణ రాష్ర్ట మంత్రి హరీష్ రావు అన్నారు. వంశీకృష్ణ, అనుశ్రీ జంటగా సిలివేరి రమేష్‌బాబు సమర్పణలో స్వీయదర్శకత్వంలో రాజ్‌కుమార్ రూపొందించిన చిత్రం ‘నువ్వేనా అది నీవేనా’.
శ్రీ వెంకట్ స్వరపరచిన ఈ చిత్రం ఆడియో ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. రాజ్‌కుమార్ చేసిన ఈ మంచి ప్రయత్నం విజయం సాధించాలని రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: బొల్లంపల్లి సాయిరమణ.