
ప్రేక్షక్షుల ముందుకు మరోసారి వచ్చేందుకు ప్రేమికుడు సిద్ధం అవుతున్నాడు. ప్రభుదేవా హీరోగా, నగ్మా హీరోయిన్‌గా రూపొందిన చిత్రం ‘ప్రేమికుడు’(తమిళంలో ‘కాదలన్’). శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1994లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ మూవీలోని ‘ముక్కాలా ముక్కాబులా’, ‘ఊర్వశి ఊర్వశి’, ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’, ‘అందమైన ప్రేమరాణి’.. వంటి పాటలన్నీ యువతను ఉర్రూతలూగించాయి.
క్లాసిక్ హిట్‌గా రూపొందిన ‘ప్రేమికుడు’ తెలుగులో రీ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. తెలుగు రీ రిలీజ్ హక్కులను నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ దక్కించుకున్నారు. సీఎల్‌ఎన్ మీడియా ద్వారా త్వరలో సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. అతి త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment