సల్మాన్ పెళ్లికి ఆ విషయానికి సంబంధం లేదు | Salman Khan's marriage not a Woman Empowerment issue, says Nagma | Sakshi
Sakshi News home page

సల్మాన్ పెళ్లికి ఆ విషయానికి సంబంధం లేదు

Published Sat, Jan 9 2016 12:44 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM

సల్మాన్ పెళ్లికి ఆ విషయానికి సంబంధం లేదు

సల్మాన్ పెళ్లికి ఆ విషయానికి సంబంధం లేదు

పాట్నా: ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మ సల్మాన్ ఖాన్ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిహార్లో పంచాయితీ ఎన్నికల్లో మహిళా సాధికారతకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన ఆమెను ఓ పాత్రికేయుడు 50 ఏళ్ల సల్మాన్ పెళ్లి గురించి ప్రశ్నించాడు. దీంతో కొంత అసహనానికి గురైన ఆమె 'మహిళా సాధికారతకు సల్మాన్ ఖాన్ పెళ్లికి ఎలాంటి సంబంధం లేదు. అది ఆయన వ్యక్తిగతమైన విషయం, ఆయన ఇష్ట ప్రకారం పెళ్లి నిర్ణయం తీసుకుంటారు' అని తెలిపారు.

ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్(ఏఐఎంసీ) జనరల్ సెక్రటరీగా ఉన్న నగ్మ.. బిహార్లో ఇటీవలి కాలంలో శాంతి భద్రతలు క్షీణించాయన్న వార్తలను కొంతమంది వ్యక్తుల అభిప్రాయంగా కొట్టిపారేశారు. 'నేను ఇక్కడ మూడు రోజులుగా మహిళలతో సమావేశమౌతున్నాను కానీ శాంతి భద్రతలు సరిగా లేవని ఎవరూ పేర్కొనలేదు' అని నితీశ్ కుమార్ పాలనను నగ్మ వెనుకేసుకొచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement