పబ్లిక్‌గా నగ్మాకు ముద్దు
* కాంగ్రెస్ ఎమ్మెల్యే వికృత చేష్ట
మీరట్: మహిళల భద్రత కోసం చట్టాలు చేశామంటూ జబ్బలు చరుచుకుంటున్న కాంగ్రెస్ గొంతులో పచ్చివెలక్కాయపడింది! మీరట్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నటి నగ్మా పట్ల ఆ పార్టీ నేత ఒకరు అసభ్యంగా ప్రవర్తించారు. శనివారం యూపీలోని హాపూర్‌లో పట్టపగలు అందరిముందూ బహిరంగ సభలో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే గజ్‌రాజ్ శర్మ.. నగ్మాను పట్టుకుని బలవంతంగా ముద్దుపెట్టుకున్నారు.
దీంతో ఆమె దిగ్భ్రాంతికి గురై అతని చేతిని విసురుగా తోసేసి, వెనక్కి నెట్టేసింది. సభలో మాట్లాడకుండానే వెళ్లిపోయింది. దీనిపై స్థానిక మునిసిపాలిటీ చైర్మన్ మాలతీ భారతీ స్పందిస్తూ.. శర్మ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, స్థానిక గురుద్వారాలో ప్రార్థన చేసేందుకు నగ్మా హాపూర్‌కు వెళ్లారు.