రజనీకాంత్‌తో నగ్మా భేటీ
చెన్నై: ఆలిండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సినీనటి నగ్మా ఆదివారం తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలిశారు. శాలువా, పుష్పగుఛ్ఛంతో ఆయనను సత్కరించారు. వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది వెల్లడి కాలేదు. మర్యాదపూర్వకంగానే రజనీకాంత్‌ను నగ్మా కలిశారని సన్నిహితులు వెల్లడించారు.
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీపై తీవ్రస్థాయిలో మండిపడిన మరుసటిరోజే నగ్మా.. రజనీకాంత్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్ కెరీర్‌లో సూపర్‌హిట్ సినిమా 'భాషా'లో నగ్మా హీరోయిన్‌గా నటించింది.