కిరణ్‌బేడీపై నగ్మా సంచలన వ్యాఖ్యలు | Nagma charges kiran Bedi with functioning like BJP representative | Sakshi
Sakshi News home page

కిరణ్‌బేడీపై నగ్మా సంచలన వ్యాఖ్యలు

Published Sat, May 6 2017 6:59 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

కిరణ్‌బేడీపై నగ్మా సంచలన వ్యాఖ్యలు - Sakshi

కిరణ్‌బేడీపై నగ్మా సంచలన వ్యాఖ్యలు

పుదుచ్చేరి: పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీపై ఆలిండియా మహిళా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, సినీనటి నగ్మా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె ఫక్తు బీజేపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. విధులు నిర్వర్తించటానికి బదులుగా ఆమె కేంద్రానికి అనుకూలంగా పుదుచ్చేరిలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.

పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు, పేదలకు రేషన్‌ బియ్యం పంపిణీతోపాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలను అమలు కాకుండా కిరణ్‌బేడీ అడ్డుపడుతున్నారని నగ్మా విమర్శించారు. గవర్నర్‌ ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదని అన్నారు. రాజకీయాలు మాని రాష్ట్ర అభివృద్ధికి సాయపడాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కోరారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవరోధాలు సృష్టిస్తోందని నగ్మా ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement