![Yesteryear actress Nagma to play Allu Arjun mom? - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/20/Untitled-17.jpg.webp?itok=VhrYJ7IF)
‘నాకు ఇంకా చాలా లైఫ్ ఉంది.. తెలుగులో చాలా సినిమాలు చేయాలనుకుంటున్నా’ అని ఇటీవల ‘టీఎస్‌ఆర్ టీవీ 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’లో లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించినప్పుడు నగ్మా అన్నారు. తెలుగు సినిమాలు చేయాలని ఆమె అలా అనుకున్నారో లేదో ఇలా నెరవేరనుందని ఫిల్మ్‌నగర్ ఖబర్. ‘బాషా’, ‘ఘరానా మొగుడు’, ‘ప్రేమికుడు’ వంటి చిత్రాలతో కథానాయికగా నగ్మా తెలుగులో చాలా పేరు తెచ్చుకున్నారు. ‘రూప్ తేరా మస్తానా నీకు డేరా వేస్తానా.., ‘ఏందిబె ఎట్టాగ ఉంది ఒళ్లు.. ఎక్కడో గుచ్చావు చేపముల్లు..., ‘మోగిందోయమ్మో శ్రుతి చేయని సిగ్గుల వీణ...’ వంటి పాటల్లో నగ్మా వేసిన స్టెప్స్‌ని అంత సులువుగా మరచిపోలేం.
కప్పుడు సౌత్‌లో స్టార్ హీరోలందరితోనూ నటించిన నగ్మా రాజకీయాల్లోకి Ðð ళ్లాక సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2002లో ‘అల్లరి రాముడు’ సినిమాలో ఆర్తీ అగర్వాల్ తల్లిగా, అదే ఏడాది ‘నిను చూడక నేనుండలేను’ సినిమాలో చేసిన ప్రత్యేక పాట తర్వాత నగ్మా తెలుగు తెరపై కనిపించలేదు. 2007 వరకూ బెంగాలీ, భోజ్‌పురి, హిందీ తదితర భాషల్లో చేశారు. ఇప్పుడు నగ్మా తెలుగు చిత్ర పరిశ్రమకి రీ–ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్నారట. ఇందులో అల్లు అర్జున్‌కి తల్లి పాత్రలో కనిపించనున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment