TSR award
-
జయసుధకు అభినయ మయూరి బిరుదు ప్రదానం
-
నా జీవితంలో ఇదే అతి పెద్ద బిరుదు
‘‘ఇన్నేళ్ల నా సినీ జీవితంలో అతి పెద్ద గిఫ్ట్ అంటే అభినయ మయూరి బిరుదే’’ అని సహజ నటి జయసుధ అన్నారు. విశాఖలో మంగళవారం టి.సుబ్బిరామిరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా నటి జయసుధకు అభినయ మయూరి బిరుదును ప్రదానం చేశారు. ఈ సందర్బంగా జయసుధ మాట్లాడుతూ – ‘‘నన్ను సినీ పరిశ్రమలోకి తీసుకు వచ్చిన విజయనిర్మల (దివంగత నటి, దర్శకురాలు) ఆంటీ ఈ బిరుదు ప్రదానోత్సవంలో లేకపోవటం నాకు చాలా వెలితిగా ఉంది. నా తొలి సినిమా ‘పండంటి కాపురం’లో జమున నా తల్లి పాత్ర పోషించారు. అప్పుడు నా వయసు 12 ఏళ్లు. ఇన్నేళ్ల తరువాత నా బిరుదు ప్రదానోత్సవంలో ఆమె పాల్గొనటం చాలా అదృష్టంగా భావిస్తున్నా. సినీ జీవితంలో చాలా మంది స్నేహితులు ఉంటారు. కానీ అందులో కొంత మంది మాత్రమే మన నిజ జీవితంలో కూడా ఉంటారు. నాకు జయప్రద, రాధిక, మురళీమోహన్ అలాంటివారే. వారు నా జీవితంలోని అన్ని విషయాల్లో భాగస్వామ్యంగా ఉన్నారు. గత 40 ఏళ్లుగా టీఎస్సార్ (టి. సుబ్బిరామిరెడ్డి) నిర్వహించే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఏనాడూ ఆయన్ని నేను ఏమీ అడగలేదు. కానీ ఇంత మంది ప్రముఖల సమక్షంలో నాకు ఈ బిరుదు ప్రదానం చేసి నాలోని ఉత్సహాన్ని నింపారు. ఆయన తన పుట్టిన రోజు వేడుకలను ఎక్కడైనా చేసుకోవచ్చు కానీ వైజాగ్ అంటే ఆయనకు ఎనలేని ప్రేమ. అందుకే అన్ని వేడుకలు విశాఖలోనే జరుపుకుంటారు’’ అన్నారు. వేదికపై ప్రసంగిస్తున్నప్పుడు నటుడు రాజశేఖర్ పేరు చెప్పబోయి రాజశేఖర్ రెడ్డి అని జయసుధ సంభోదించారు. దీనితో వైఎస్సార్ ఆశీస్సులు కూడా తనపై ఉన్నాయని అందుకునే తన నోట వెంట ఆయన పేరు వచ్చిందని జయసుధ అన్నారు. ►నటి జమున మాట్లాడుతూ – ‘‘జయసుధను ఎందుకు అందరూ సహజ నటి అంటారు.. మేము కాదా అనిపించేది. కానీ ఆమె తక్కువ మేకప్‌తో ఎక్కవ నటన ప్రదర్శించి ప్రేక్షకుల మనస్సులను దోచుకోవటం వలనే ఆ బిరుదు వచ్చిందని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కళాకారులకు ఇలాంటి అవార్డులు, బిరుదుల ప్రదానం వలన ప్రోత్సాహం, ఎంతో ఉత్సాహం లభిస్తుంది’’ అన్నారు. ►నటి శారద మాట్లాడుతూ – ‘‘ఒక చిత్రంలో నేను జయసుధ చెంప పై గట్టిగా కొట్టాలి. ఆ సన్నివేశంలో ఆమె నటించిన తీరు ఆద్భుతం’’ అని చెప్పారు. కళ ఒక మహాశక్తి: టీఎస్సార్ టి. సుబ్బిరామి రెడ్డి మాట్లాడుతూ –‘‘కళ ఒక మహా శక్తి అని నేను నమ్ముతాను. అందుకే కళాకారులను ప్రోత్సహిస్తాను. సర్వమతాల సారాంశం ఒక్కటే. అందుకే అన్ని మతాల గురువులను సన్మానించాను. అందరూ ప్రతీ సంవత్సరం జన్మదినం జరుపుకుంటారు. అయితే అటువంటి కార్యక్రమాలు నలుగురికి ఉపయోగపడేలా చేసుకోవాలని ఆలోచించుకోవాలి. అక్కినేని నాగేశ్వరరావు నాకు మంచి స్నేహితుడు. ఆయన స్ఫూర్తితోనే ఈ విధంగా నలుగురి మధ్యలో నా జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఏం సాధించాం, ఏం సా«ధించబోతున్నాం అని నెమరువేసుకుంటాను. కొన్నేళ్లుగా ఇలా విశాఖ నగరవాసుల మ«ధ్యనే ఈ వేడుకలు జరుపుకుంటూ గొప్ప గొప్ప కళాకారులను సన్మానిస్తున్నాను. ఈ ఏడాది జయసుధకు అభినయ మయూరి బిరుదు అందించడం ఆనందంగా ఉంది. జయసుధ సౌమ్యురాలు. ఆమె అందరికీ మంచి స్నేహితురాలు. ఆమె అన్ని పాత్రల్లోనూ జీవించారు’’ అని చెప్పారు.ఈ వేడుకల్లో భాగంగా జయసుధకు బంగారు కంకణాన్ని బహుకరించారు. 20 నిముషాలపాటు టీఎస్సార్ చేసిన ఓంకారం వీక్షకులను ఆకట్టుకుంది.ఈ వేడుకలో టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, హాస్యనటుడు బ్రహ్మానందం, రాజశేఖర్, శరత్ కుమార్, జయప్రద, రాధిక, జీవిత, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా తదితరులు పాల్గొన్నారు. -
చిటపట చినుకులు పాట పాడుతుంటారు
‘‘నేనెక్కడ కనిపించినా తెలుగు ప్రేక్షకులు ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే..’ పాట పాడుతూ ఉంటారు. ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో నేను యన్టీఆర్‌ను అన్నయ్యా అంటాను. ఆ సంభాషణను గుర్తుచేసి మళ్లీ మళ్లీ ఆ డైలాగులు చెప్పమని అడుగుతుంటారు. మరోసారి ఈ విషయాలను గుర్తు చేసుకోవటం ఆనందంగా ఉంది అన్నారు’’ ప్రముఖ నటి బి.సరోజాదేవి. ఆమెకు టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘విశ్వనట సామ్రాజ్ఙి’ బిరుదును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సరోజాదేవి మాట్లాడుతూ– ‘‘సుబ్బరామిరెడ్డికి కళలన్నా, కళాకారులన్నా ఎంతో గౌరవం. శివరాత్రి రోజున ఈ పురస్కారం అందుకోవటం ఆనందంగా ఉంది’’ అన్నారు. టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘ఆ రోజుల్లో హీరోల్ని మించి పారితోషికం అందుకున్న నటి సరోజాదేవి. ఆమెకి తెలుగు ప్రజల తరఫున ప్రదానం చేసిన బిరుదు ఇది’’ అన్నారు. ఈ వేడుకలో ప్రముఖ నటీమణులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, గాయని పి.సుశీల తదితరులు పాల్గొన్నారు. -
విశ్వనటసామ్రాజ్ఞి
అద్భుతమైన అభినయ ప్రతిభతో జాతీయ స్థాయి నటిగా పేరు సంపాదించుకున్నారు బి. సరోజాదేవి. ఆమెను ‘పద్మశ్రీ, పద్మభూషణ్’ అవార్డులు వరించాయి. తాజాగా ‘విశ్వనటసామ్రాజ్ఞి’ అనే బిరుదును ఆమె అందుకోబోతున్నారు. విశాఖ రామకృష్ణ బీచ్‌లో టీఎస్సార్ లలితా కళాపరిషత్ ఆధ్వర్యంలో ఆమె ఈ అవార్డును స్వీకరించనున్నారు. మార్చి 4 మహాశివరాత్రి పర్వదినాన విశాఖలో వైభవంగా జరిగే ఈ వేడుకలో బి. సరోజాదేవికి ‘విశ్వనటసామ్రాజ్ఞి’ అనే బిరుదును ప్రదానం చేయనున్నట్లు కళాబంధు డా. టి. సుబ్బరామిరెడ్డి తెలిపారు. సాలూరి వాసూరావు సంగీత విభావరి ఉంటుంది. ఈ సన్మాన కార్యక్రమంలో ప్రముఖ నటుడు సుమన్, నటీమణులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, మీనా, ప్రముఖ గాయని పి. సుశీలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినాన్ని టి. సుబ్బరామిరెడ్డి వైజాగ్‌లో జరుపుతుంటారు. పాతికేళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. -
అలా అనుకున్నారు.. ఇలా వచ్చేస్తున్నారా!
‘నాకు ఇంకా చాలా లైఫ్ ఉంది.. తెలుగులో చాలా సినిమాలు చేయాలనుకుంటున్నా’ అని ఇటీవల ‘టీఎస్ఆర్ టీవీ 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’లో లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు ప్రకటించినప్పుడు నగ్మా అన్నారు. తెలుగు సినిమాలు చేయాలని ఆమె అలా అనుకున్నారో లేదో ఇలా నెరవేరనుందని ఫిల్మ్‌నగర్ ఖబర్. ‘బాషా’, ‘ఘరానా మొగుడు’, ‘ప్రేమికుడు’ వంటి చిత్రాలతో కథానాయికగా నగ్మా తెలుగులో చాలా పేరు తెచ్చుకున్నారు. ‘రూప్ తేరా మస్తానా నీకు డేరా వేస్తానా.., ‘ఏందిబె ఎట్టాగ ఉంది ఒళ్లు.. ఎక్కడో గుచ్చావు చేపముల్లు..., ‘మోగిందోయమ్మో శ్రుతి చేయని సిగ్గుల వీణ...’ వంటి పాటల్లో నగ్మా వేసిన స్టెప్స్‌ని అంత సులువుగా మరచిపోలేం. కప్పుడు సౌత్‌లో స్టార్ హీరోలందరితోనూ నటించిన నగ్మా రాజకీయాల్లోకి Ðð ళ్లాక సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2002లో ‘అల్లరి రాముడు’ సినిమాలో ఆర్తీ అగర్వాల్ తల్లిగా, అదే ఏడాది ‘నిను చూడక నేనుండలేను’ సినిమాలో చేసిన ప్రత్యేక పాట తర్వాత నగ్మా తెలుగు తెరపై కనిపించలేదు. 2007 వరకూ బెంగాలీ, భోజ్‌పురి, హిందీ తదితర భాషల్లో చేశారు. ఇప్పుడు నగ్మా తెలుగు చిత్ర పరిశ్రమకి రీ–ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్నారట. ఇందులో అల్లు అర్జున్‌కి తల్లి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. -
ప్రేక్షకుల ఆనందమే నాకు కొండంత బలం
‘‘కళలను ఎంతో అభిమానిస్తాను. కళాకారులను ప్రోత్సహించి అభినందించడం గొప్ప అదృష్టం. అందుకే ‘టీయస్సార్’ అవార్డులను స్టార్ట్ చేశాం. అవార్డు గ్రహీతల ఎంపిక విషయంలో సొంత నిర్ణయాలకు తావు లేకుండా ప్రజాభిప్రాయాన్నే అంతిమ తీర్పుగా జ్యూరీ సభ్యులు పాటించారు’’ అని ప్రముఖ పారిశ్రామికవేత్త, కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి అన్నారు. ‘టీయస్సార్’ జాతీయ అవార్డుల వేడుక ఈ నెల 8న విశాఖపట్నంలో జరగనుంది. విజేతల పేర్లు ప్రకటించేందుకు గురువారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ –‘‘టీయస్సార్ అవార్డులు జాతీయ స్థాయిలో నంబర్ వన్‌గా నిలవాలనేది నా కల. తెలుగువారికి జాతీయ స్థాయిలో గౌరవం లభించాలి. తెలుగువారు ఇంత పెద్ద ఫంక్షన్ చేసారే అని హిందీవాళ్లు ఆశ్చర్యపోవాలి. ఈ అవార్డుల్లో రెండు రకాలు ఉన్నాయి. ప్రేక్షకులు కొన్ని ఎంపిక చేయగా, మరికొన్ని అవార్డులను జ్యూరీ మెంబర్స్ ఎంపిక చేశారు. మంచి సినిమాల సంఖ్య పెరగడంతో ఈసారి అవార్డుల సంఖ్య పెరిగింది. ఈ ప్రోగ్రామ్‌ను చూసేందుకు ప్రేక్షకులు ఇబ్బందిపడకుండా నిమిషాల వ్యవధిలో అన్ని ఛానెల్స్‌లో ప్రసారం అయ్యేలా ప్లాన్ చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి సుబ్బిరామిరెడ్డికి డబ్బు ఎలా వస్తుందని కొందరు అనుకుంటారు. రాత్రికి రాత్రే నేను ధనవంతుణ్ని కాలేదు. 50 ఏళ్లకు పైగా అన్ని రంగాల్లో వ్యాపారవేత్తగా కష్టపడుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందు మనసు రావాలి, ఏకాగ్రత కుదరాలి, కృషి ఉండాలి. అప్పుడే చేయగలం. ప్రేక్షకులు ఈ ప్రోగ్రామ్ చూసి, ఎంజాయ్ చేస్తారు. వారి ఆనందమే నాకు కొండంత శక్తిని ఇస్తుంది’’ అని అన్నారు. జ్యూరీ సభ్యులు రఘురామ కృష్ణమ్రాజు, బి.గోపాల్, ఆర్.వి ప్రసాద్, పింకీరెడ్డి, విక్రమ్ పాల్గొన్నారు.