విశ్వనటసామ్రాజ్ఞి | TSR honors B Saroja Devi with Viswanata Samragni | Sakshi
Sakshi News home page

విశ్వనటసామ్రాజ్ఞి

Published Sun, Feb 24 2019 1:12 AM | Last Updated on Sun, Feb 24 2019 1:12 AM

 TSR honors B Saroja Devi with Viswanata Samragni - Sakshi

అద్భుతమైన అభినయ ప్రతిభతో జాతీయ స్థాయి నటిగా పేరు సంపాదించుకున్నారు బి. సరోజాదేవి. ఆమెను ‘పద్మశ్రీ, పద్మభూషణ్‌’ అవార్డులు వరించాయి. తాజాగా ‘విశ్వనటసామ్రాజ్ఞి’ అనే బిరుదును ఆమె అందుకోబోతున్నారు. విశాఖ రామకృష్ణ బీచ్‌లో టీఎస్సార్‌ లలితా కళాపరిషత్‌ ఆధ్వర్యంలో ఆమె ఈ అవార్డును స్వీకరించనున్నారు. మార్చి 4 మహాశివరాత్రి పర్వదినాన విశాఖలో వైభవంగా జరిగే ఈ వేడుకలో బి. సరోజాదేవికి ‘విశ్వనటసామ్రాజ్ఞి’ అనే బిరుదును ప్రదానం చేయనున్నట్లు కళాబంధు డా. టి. సుబ్బరామిరెడ్డి తెలిపారు.

సాలూరి వాసూరావు సంగీత విభావరి ఉంటుంది. ఈ సన్మాన కార్యక్రమంలో ప్రముఖ నటుడు సుమన్, నటీమణులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, మీనా, ప్రముఖ గాయని పి. సుశీలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినాన్ని టి. సుబ్బరామిరెడ్డి వైజాగ్‌లో జరుపుతుంటారు. పాతికేళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement